యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘వార్’కు సీక్వెల్ గా వస్తున్న ‘వార్ 2’లో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారు. తొలిసారి నేరుగా హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కొనసాగుతోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఈ ఏడాది చివరలో ‘వార్ 2’ టీమ్ తో జాయిన్ కాబోతున్నారు.
ఎన్టీఆర్ తో అయాన్ కీలక భేటీ
ఇక ‘దేవర’కు సంబంధించిన తాజా షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నారు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ‘వార్ 2’ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆయనను కలిశారు. హైదరాబాద్ ఇద్దరు మీట్ అయ్యారు. ఈ సందర్భంగా అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ కు స్ర్కిప్ట్ వినిపించినట్లు తెలుస్తోంది. ఆయన పాత్రకు సంబంధించిన వివరాలను కూడా వివరించారట. సినిమా స్ర్కిప్ట్, తన క్యారెక్టర్ ఎన్టీఆర్ కు బాగా నచ్చిట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి చర్చించేందుకు అయాన్ గతంలో ఓసారి ఎన్టీఆర్ ను కలిశారు. సినిమా కథ గురించి వివరించారు. తాజాగా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కావడంతో ఫైనల్ గా ఓసారి ఆయనకు వివరించారట. అటు ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ డేట్స్ కూడా దాదాపు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ‘దేవర’ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో, ‘వార్ 2’ షూటింగ్ కు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే విషయంపై ఓ క్లారిటీ ఇచ్చినట్లు టాక్. ‘వార్ 2’ సినిమా చాలా వరకు ముంబైలోనే షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.
కనీవినీ ఎరుగని రీతిలో యాక్షన్ సీక్వెన్స్
‘RRR’ మూవీ తర్వాత ఎన్టీఆర్ రేంజి అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో ఆయన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ‘వార్ 2’లో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాకు ఎన్టీఆర్ క్రేజ్ ఎంతో ప్లస్ కాబోతోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ ను దర్శకుడు ఓ రేంజిలో సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ కనీవినీ ఎరుగని రీతిలో ఈ యాక్షన్ చిత్రాన్ని మలువబోతున్నారట. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లతో ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ రూపొందించబోతున్నారట. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి లోగా ‘దేవర’ మూవీని కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట ఎన్టీఆర్.
2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం భారీగా బడ్జెట్ వెచ్చిస్తోందట. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ మూవీని 2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
Read Also: నన్ను వాడుకుని సంగీతను సల్మాన్ మోసం చేశాడు - పాకిస్తాన్ నటి సంచనల ఆరోపణలు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial