బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో నటి సబా ఆజాద్ రిలేషన్‌లో ఉందంటూ గత కొంతకాలంగా బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దానికి తోడు వీరిద్దరూ జంటగా ఇప్పటికే పలు ఈవెంట్స్ కి అటెండ్ అవ్వడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. దాంతో హృతిక్ రోషన్ త్వరలోనే సబా ఆజాద్‌ని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని అందుకు వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారనే రూమర్స్ సైతం బయటకు వచ్చాయి. కానీ దీనిపై హృతిక్ రోషన్ కానీ, సబా కానీ క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే సబా ఆజాద్ ప్రస్తుతం 'హూ ఇస్ యువర్ గైనిక్'(Who Is Your Gynac) అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.


ప్రస్తుతం అమెజాన్ మినీ టీవీలో ఈ సీరిస్ ప్రసారం అవుతోంది. అయితే ఈ సీరిస్ ప్రమోషన్స్‌లో భాగంగా సబా ఆజాద్ బాలీవుడ్‌లో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సబా అజాద్ తనపై వస్తున్న రూమర్స్ పై మొదటి సారి స్పందించింది. తమ రిలేషన్షిప్ గురించి చాలా మంది చాలా రకాలుగా ట్రోల్స్ చేశారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వాటితో తాను చాలా ఇబ్బందులు కూడా పడినట్లు తెలిపింది.


"ఇతరుల నుంచి వచ్చే విమర్శలు తట్టుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే నేనేం రాయిని కాదు కదా. వాళ్ళు చేసే కామెంట్స్ నా మనసును ఎంతో బాధపెట్టాయి. ఆ ట్రోలింగ్స్ చూసి నేను మీకు ఏమన్నా చేశాను? నా జీవితం నా ఇష్టం కదా? మీరు కూడా మీ లైఫ్ లో మీకు ఇష్టం వచ్చినట్లు జీవించండి అని వాళ్లకు చెప్పాలనుకున్నా. కొన్ని రోజుల తర్వాత ఇలాంటి మాటలను పట్టించుకోకూడదు అని నాకు పూర్తిగా అర్థమైంది. అప్పటినుంచి ట్రోల్స్ ను పట్టించుకోవడం మానేసి మనశ్శాంతితో జీవిస్తున్నా" అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సబా ఆజాద్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


కాగా హృతిక్ రోషన్, సబా అజాద్ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు అధికారికంగా ఎక్కడ మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా ఈ జంట ఒకరిపై ఒకరు తమ ప్రేమను చూపిస్తూ వచ్చారు. వయసులో తన కంటే 12 ఏళ్లు పెద్ద వ్యక్తితో ప్రేమలో ఉండటంపై సబా ఆజాద్‌ను పలుసార్లు నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. అంతేకాకుండా విడాకులు తీసుకున్న వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉండడమేంటని ప్రశ్నించారు. ఇక హృతిక్ రోషన్ విషయానికొస్తే డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో సుసానే ఖాన్ ను వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల అనంతరం 2014 నవంబర్ లో విడాకులు తీసుకున్నారు.


ఈ జంటకు ఇద్దరు కుమారులు ప్రేహాన్, హృదాన్ ఉన్నారు. హృతిక్ రోషన్ ప్రస్తుతం 'ఫైటర్'(Fighter) అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. దీపికా పదుకొనే, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'వార్ 2'(War2) లో నటిస్తున్నాడు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 2025 లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


Also Read : యుద్ధానికి రెడీ అవుతున్న జూ. ఎన్టీఆర్ - దర్శకుడు అయాన్‌తో కీలక భేటీ



Join Us on Telegram: https://t.me/abpdesamofficial