హీరోయిన్లు మందు కొడతారా? సిగరెట్ తాగుతారా? ఒక్కొక్కరిదీ ఒక్కో దారి. సినిమా హీరోయిన్లు కూడా సమాజంలో భాగమే కదా! అమ్మాయిలు అందరూ మందు కొడుతూ సిగరెట్లు తాగడం లేదు కదా! మందు, సిగరెట్ అనేవి వ్యక్తిగత అలవాట్లు. ఎవరి ఇష్టం వాళ్ళది. కొంత మంది తమకు అలవాటు ఉన్న విషయాన్ని చెబుతారు. కొందరు చెప్పరు. అయితే, శృతి హాసన్ తరహాలో ఉన్నది ఉన్నట్లు చెప్పేది ఎంత మంది?


మందు కొట్టాను కానీ...
శృతి హాసన్ మందు కొట్టేవారు. కొట్టేవారు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే... ఇప్పుడు తాగడం లేదు కాబట్టి! ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. నిన్న (బుధవారం) రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు శృతి హాసన్ సమాధానాలు ఇచ్చారు. ఐ నెటిజన్ మందు గురించి ప్రశ్నించారు. 


'విస్కీ, బీర్, కాక్ టైల్, వోడ్కా... మీ ఫేవరెట్ ఏది?' అని ఒకరు అడగ్గా... ''నాది చాలా సోబర్ లైఫ్ (అంటే డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటికి దూరమైనా జీవితం). ఆరేళ్ళుగా అలాగే జీవిస్తున్నాను. నేను ఆల్కహాల్ ముట్టుకోను. మీరు చెప్పిన వాటిలో ఏదీ నా ఫేవరెట్ కాదు. కొన్నిసార్లు నేను నాన్ ఆల్కహాలిక్ బీర్లు తాగుతాను. నేను తాగను. హ్యాపీగా ఉన్నాను'' అని శృతి హాసన్ సమాధానం ఇచ్చారు. ఎటువంటి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు ఆమె చెప్పారు. ఈ ఒక్క ప్రశ్న విషయంలోనే కాదు, ఇంకా చాలా విషయాల్లో నిర్భయంగా మనసులో మాట చెప్పారు.


'లైగర్' సినిమాలో హీరోయిన్ అనన్యా పాండే గుర్తు ఉన్నారా? ఈ మధ్య కజిన్ మెహందీ వేడుకకు ఆమె వెళ్లారు. అక్కడ సిగరెట్ తాగారు. దాన్ని కెమెరాలో బంధించిన ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనన్యా అంటే హిందీలో క్రేజ్ ఉంది. దాంతో కొన్ని క్షణాల్లో ఆ ఫోటో వైరల్ అయ్యింది. ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి చేత డిలీట్ చేయించారు అనుకోండి. ఈ తరుణంలో శృతి హాసన్ ఒకప్పుడు మందు కొట్టానని చెప్పడం విశేషమే. 


Also Read రాజమౌళి అవార్డులు మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదట


ప్రస్తుతం శృతి హాసన్ చేస్తున్న సినిమాలకు వస్తే... రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్' సినిమాలో నటిస్తున్నారు. అందులో ఆమెది జర్నలిస్ట్ రోల్. ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న ఇండియన్ సినిమా అది ఒక్కటే. ఇంగ్లీష్ సినిమా 'ది ఐ'లో శృతి హాసన్ నటిస్తున్నారు.
 
సంక్రాంతికి రెండు విజయాలతో 2023 స్టార్ట్ చేశారు శృతి హాసన్. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా 'వీర సింహా రెడ్డి' సినిమాలో, మెగాస్టార్ చిరంజీవి సరసన 'వాల్తేరు వీరయ్య' సినిమాలో నటించారు. రెండు రోజుల వ్యవధిలో విడుదలైన ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ బరిలో భారీ విజయాలు సాధించాయి. వంద కోట్ల వసూళ్ల మార్క్ దాటాయి. ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.    


Also Read : చిరంజీవికి ఒక్క మేసేజ్ చేశాను, నా వైద్యం ఖర్చు మొత్తం ఆయనే భరించారు: నటుడు పొన్నంబలం