కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya Sivakumar) రీసెంట్ గా 'కంగువ' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ తో పాటు సూర్య కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. దీంతో ఈ సినిమా రిజల్ట్ ను పక్కన పెట్టి, తన నెక్స్ట్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు సూర్య. అయితే తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినట్టుగా వెల్లడించి హీరోయిన్ శ్రియా వార్తల్లో నిలిచింది. 


సూర్య హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం 'సూర్య 44'. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్టు రీసెంట్ గా హీరోయిన్ శ్రియ వెల్లడించింది. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆమె సూర్య సినిమాలో తన పాత్ర గురించి వెల్లడించింది. ఈ మేరకు శ్రియ మాట్లాడుతూ "నేను సూర్య సినిమాలో ఓ పాట చేశాను. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. డిసెంబర్లో ఈ సాంగ్ రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను' అని చెప్పి సర్ప్రైజ్ వచ్చింది. గోవాలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో ఈ పాటను షూట్ చేశారని, శ్రియ గ్రేస్, ఎనర్జీ హైలెట్ చేస్తూ మేకర్స్ తీసిన ఈ పాట విజువల్ ఫీస్ట్ గా ఉంటుందని తెలుస్తోంది. సూర్య కూడా ఈ ఐటమ్ సాంగ్లో అదిరిపోయే స్టెప్పులు వేశారని సమాచారం.


గతంలో స్టార్ హీరోయిన్ గా సౌత్ ను ఏలిన శ్రియ ఐటెం సాంగ్స్ లో కూడా అదరగొట్టింది. ఇప్పుడు మరోసారి ఐటమ్స్ సాంగ్ తో ప్రేక్షకులను ఊపేయడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా తన నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ గురించి కూడా ఓపెన్ అయ్యింది శ్రియ. "నేను ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటిస్తున్నాను. మరో మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది" అంటూ అభిమానులకు తాను నటించబోయే పాన్ ఇండియా సినిమా గురించి గుడ్ న్యూస్ చెప్పింది. కానీ ఆ పాన్ ఇండియా సినిమా ఏంటి అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో పెట్టింది. మరి ఈ బ్యూటీ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఏమై ఉంటుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.



ఇక సూర్య హీరోగా నటిస్తున్న 'సూర్య 44' సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సూర్య సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా...  జయరామ్, బోజు జార్జ్, కరుణాకరన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కార్తీక్ సుబ్బారాజ్ దర్శకత్వం కూడా వహిస్తున్నారు.  


Read Also : Allu Arjun: అల్లు అర్జున్ మీద పోలీస్ కంప్లైంట్... ఫ్యాన్స్‌ను ఆర్మీ అంటే ఎలా?