విక్రాంత్ (Vikranth)ను కథానాయకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తూ... డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ సంస్థ భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పార్క్ L.I.F.E' (Spark Movie). ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు హీరో విక్రాంత్ దర్శకత్వం వహించారు. ఇందులో రెండో పాటను తాజాగా విడుదల చేశారు. 


ఇది ఇది మాయా... విక్రాంత్, మెహరీన్ పాట!
లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, సింగర్ శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)లది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్! వాళ్ళ కలయికలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. ఇప్పుడు 'స్పార్క్' సినిమాలో సాంగ్ కూడా ఆ హిట్ సాంగ్స్ జాబితాలో చేరుతుందని చెప్పవచ్చు. ఆల్రెడీ ఈ సినిమాలో ''ఏమా అందం ఏమా అందం... భామా నీకు భువితో ఏమి సంబంధం! ఏం సంబంధం?'' అంటూ సాగిన తొలి పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఆ పాటకు కూడా అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. సిద్ శ్రీరామ్ పాడారు.


'ఇది ఇది మాయా...' పాటను శ్రేయా ఘోషల్ పాడారు. మలయాళ సినిమా 'హృదయం'తో భాషలకు అతీతంగా శ్రోతలను ఆకట్టుకున్న సంగీత దర్శకుడు హిషామ్ అబ్దుల్ వాహబ్. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి'కి కూడా చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించారు. 'స్పార్క్' సినిమాకు ఆయన సంగీతం అందిస్తున్నారు. 'ఇది ఇది మాయా' పాటను విదేశాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకటించారు.


Also Read : 'గం గం గణేశా'లో సాంగ్ విడుదల చేసిన రష్మిక - 'ప్రేమిస్తున్నా' కంటే పెద్ద హిట్ కావాలి ఆనందా



నవంబర్ 17న 'స్పార్క్' విడుదల!
నవంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'స్పార్క్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కొత్త హీరో, కొత్త దర్శకుడు అయినప్పటికీ... ప్రచార చిత్రాలు, పాటలు బావుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. టీజర్ చూస్తే ఇదొక చిన్న సినిమా అని ఎక్కడా కనిపించలేదు. ప్రేమ, యాక్షన్, ప్రతీకారం సినిమాలో ఉన్నాయని టీజర్ ద్వారా చెప్పారు.


Also Read : రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...



ప్రతినాయకుడిగా గురు సోమసుందరం
మలయాళంలో రూపొందిన సూపర్ హీరో సినిమా 'మిన్నల్ మురళి'. అందులో టీ షాపులో పని చేసే వ్యక్తికి సూపర్ పవర్స్ వస్తాయి చూడండి! ఆ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన గురు సోమసుందరం (Guru Somasundaram) గుర్తు ఉన్నారా? ఇప్పుడు ఆయన తెలుగులో సినిమా చేస్తున్నారు. అదీ ప్రతినాయకుడిగా! విలన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారన్నమాట!
 
'స్పార్క్'లో నాజ‌ర్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, 'వెన్నెల' కిశోర్, షాయాజీ షిండే, సత్య, 'వెన్నెల' కిశోర్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన తారాగణం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర సహాయకుడిగా పని చేసిన రవి వర్మ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial