యంగ్, ప్రామిసింగ్ యంగ్ హీరో శివ కందుకూరి (Shiva Kandukuri) వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుని ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంటారు. నటుడిగా వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు వీలున్న కథలను ఎంపిక చేసుకునే ఆయన, ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదే '#చాయ్ వాలా'.
శివ కందుకూరి హీరోగా #చాయ్ వాలా!Shiva Kandukuri First Look In #ChaiWaala: శివ కందుకూరి కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా '#చాయ్ వాలా'. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష దర్శకుడు. హర్షిక ప్రొడక్షన్స్ పతాకం మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు సంయుక్తంగా భారీ ఎత్తున ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం, ఆగస్టు 8) ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
Also Read: నాగార్జున గారూ... అంత సింప్లిసిటీ ఏంటండీ? జపనీస్‌లో నాగ్ సామ మాటలు... ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్
'#చాయ్ వాలా'లో శివ కందుకూరితో పాటు రాజీవ్ కనకాల స్కూటీపై అలా జాలీగా తిరుగుతున్న స్టిల్ ఫస్ట్ లుక్ కింద విడుదల చేశారు. హైదరాబాద్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ''ప్రేమ, వారసత్వం అంశాలు మేళవించిన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. పర్ఫెక్ట్ చాయ్, కప్పులా ఉంటుందీ సినిమా. త్వరలో భావోద్వేగాలు, సంప్రదాయాలు, కలలతో నిండిన అద్భుతమైన ప్రయాణాన్ని చూసేందుకు రెడీగా ఉండండి. అతి త్వరలో టీజర్ విడుదల చేస్తాం'' అని దర్శక నిర్మాతలు తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిదని పేర్కొన్నారు. '#చాయ్ వాలా' సినిమాకు సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, సినిమాటోగ్రఫీ: క్రాంతి వర్ల, ఎడిటర్: పవన్ నర్వా.