Nani's Jadal Role In The Paradise Movie: ముక్కుకు పుడకలు... గుబురు గెడ్డం... రెండు జడలు... కళ్లద్దాలతో మాస్ లుక్. వెనుక బ్లేడ్, బుల్లెట్స్, వెపన్స్‌తో ఉన్న ఓ డిఫరెంట్ చక్రం. నేచరల్ స్టార్ నానిని ఇదివరకు ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ లుక్‌లో 'ది ప్యారడైజ్' మూవీలో చూపించారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. మూవీలో నాని పేరు జడల్' కాగా ఆయన రోల్ ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సింగిల్‌గానే...
ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించగా... తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ వేరే లెవల్‌లో ఉంది. మూవీలో 'జడల్'గా ఆయన పాత్రను పరిచయం చేయగా... దానికి మరింత ఎలివేషన్ ఇస్తూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మరో పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'నా జడల్ నాని అన్న. అతని వైఖరి ప్రపంచానికి వ్యతిరేకంగా ఉండొచ్చు. ప్రపంచం అంతం కావొచ్చు. ఆయన అన్నింటినీ ఒంటరిగా ఎదుర్కొంటాడు. ఆయన 'ది ప్యారడైజ్'లో మరెవరూ లేని విధంగా లేస్తాడు.' అంటూ కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు.
చుట్టూ కత్తులతో ఓ సమూహం మీదకు వస్తున్నా... కళ్లల్లో ఎలాంటి బెరుకు లేకుండా ఓ పవర్ ఫుల్ వారియర్‌గా 'జడల్' కూర్చున్న తీరు ఆకట్టుకుంటోంది. ఏది ఏమైనా ఆయన ఒక్కడే అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటాడు అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ పోస్టర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
Also Read: నాగార్జున గారూ... అంత సింప్లిసిటీ ఏంటండీ? జపనీస్‌లో నాగ్ సామ మాటలు... ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్
అసలు స్టోరీ ఏంటంటే?
ఈ మూవీలో నాని ఓ మాస్ వారియర్‌గా కనిపించనున్నట్లు గ్లింప్స్, లుక్స్‌ను బట్టి అర్థమవుతోంది. 'కడుపు మండిన కాకుల కథ. జమానాకెళ్లి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ.' అనే డైలాగ్స్ చరిత్రలో ఓ అట్టడుగున ఉన్న వర్గానికి చెందిన నాయకుడి స్టోరీ అని తెలుస్తోంది. 1960 బ్యాక్ డ్రాప్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా మూవీ తెరకెక్కుతుండగా... టరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్‌ను బ్యాక్ డ్రాప్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఎక్కడో ఎవరికీ తెలియని ఓ వర్గం... వారి వెనుక ఉన్న కన్నీటి గాథలు... ఎన్నో అవమానాలు ఎదుర్కొనే తన వారిని రక్షించుకునేందుకు ఆ లీడర్ ఏం చేశాడు? అనేదే మూవీ స్టోరీ అని గ్లింప్స్, లుక్స్ ద్వారా చెప్పకనే చెప్పారు మేకర్స్. మరి ఈ ప్యారడైజ్ ఏంటో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
వచ్చే ఏడాది రిలీజ్
ఈ మూవీని ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా... బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జ్యుయెల్ కీలక పాత్ర పోషించనున్నారు. 2026, మార్చి 26న తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.