Shaitaan Movie Completes Censor: ఒకప్పుడు సినిమా విడుదలకు కనీసం వారం ముందే సెన్సార్ పనులు పూర్తయ్యి.. వద్దు అనుకునే సీన్స్‌ను కట్ చేయమని సలహా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. విడుదలకు ఒకరోజు లేదా రెండు రోజుల ముందు సినిమాల్లో మార్పులు చెప్తోంది సెన్సార్ బోర్డ్. తాజాగా మరో హిందీ విషయం సినిమాలో కూడా అదే జరిగింది. అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్‌లో నటించిన ‘సైతాన్’ సినిమా మార్చి 8న విడుదలకు సిద్దమవ్వగా.. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చెప్పింది సెన్సార్. భయంకరంగా ఉన్న ఒక సీన్‌ను పూర్తి కట్ చేయమని ఆదేశించిందని సమాచారం.
ఆ సీన్ కట్..
అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్ చేస్తున్న ‘సైతాన్’పై బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా అంచనాలు పెరిగిపోయాయి. పూర్తిస్థాయి హారర్ చిత్రంగా తెరకెక్కిన ‘సైతాన్’ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) యూ/ఏ సర్టిఫికెట్‌ను అందించి.. కొన్ని మార్పులు చెప్పినట్టు సమాచారం. దాంతో పాటు ఒక భయంకరమైన సీన్‌ను కట్ చేయమని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. గుజరాత్‌లో మంచి హిట్ అందుకున్న ‘వశ్’ అనే చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది ‘సైతాన్’. ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ఇప్పటికే ట్రైలర్, టీజర్ ద్వారా ఓ క్లారిటీ వచ్చింది.
హెచ్చరిక ఇవ్వాలి..
‘సైతాన్’ పూర్తిగా బ్లాక్ మ్యాజిక్, చేతబడిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి సినిమా మొదలయ్యే ముందే.. ‘ఈ చిత్రం బ్లాక్ మ్యాజిక్‌ను సపోర్ట్ చేయడం లేదు’ అని హెచ్చరిక ఇవ్వాలని సెన్సార్ బోర్డ్ తెలిపింది. అంతే కాకుండా ఒక సీన్‌లో వచ్చే బూతు పదాన్ని అరుపుతో రీప్లేస్ చేయమని దర్శకుడు వికాస్ బాహ్ల్‌కు చెప్పింది. వీటితో పాటు రక్తం కనపడే సీన్స్‌ను 25 శాతం తగ్గించమని సెన్సార్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక వారు చెప్పిన మార్పులు చేర్పులు అన్నీ చేసిన తర్వాత సినిమా రన్ టైమ్.. 132 నిమిషాలకు చేరింది. అంటే ‘సైతాన్’ రన్ టైమ్ కేవలం గంటన్నర మాత్రమే. దీంతో ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలను ఇష్టపడనివారికి ‘సైతాన్’ మొదటి ఛాయిస్‌గా మారనుంది.
చాలా ఏళ్ల తర్వాత..
జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ కలిసి ‘సైతాన్’ను సంయుక్తంగా నిర్మించారు. అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేర్ పాఠక్.. దీనికి నిర్మాతలుగా వ్యవహరించారు. మార్చి 8న విడుదల అవ్వనున్న ఈ సినిమాపై ఫస్ట్ లుక్ నుండే ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా చేశారు మేకర్స్. వికాస్ బాహ్ల్.. దీనిని డైరెక్ట్ చేశారు. ఒకప్పుడు హీరో, హీరోయిన్‌గా కలిసి నటించిన మాధవన్, జ్యోతిక మళ్లీ దాదాపు పాతికేళ్ల తర్వాత ఇలా బాలీవుడ్‌లో కలిసి నటిస్తూ రీఎంట్రీకి సిద్ధమయ్యారు. పెళ్లి తర్వాత సినిమాల్లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండని జ్యోతిక.. ఎన్నో ఏళ్ల తర్వాత ‘సైతాన్’తో మరోసారి హిందీ ప్రేక్షకులను నేరుగా పలకరించనుంది.
Also Read: స్టార్ హీరోయిన్ కాజల్‌కు చేదు అనుభవం - అసభ్యంగా తాకిన అభిమాని, షాకైన నటి