Kajal Aggarwal: స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌కు చేదు అనుభవం - అసభ్యంగా తాకిన అభిమాని, షాకైన నటి

Kajal Aggarwal: హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి హాజరైన కాజల్‌ అగర్వాల్‌తో ఓ ఆకతాయి అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి తీరుతో హీరోయిన్‌ కాజల్‌ ఇబ్బంది పడ్డ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Continues below advertisement

Fan Misbehaved With Kajal Aggarwal: పబ్లిక్‌లో అభిమానులతో తీరుతో హీరోహీరోయిన్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే చూశాం. ముఖ్యంగా హీరోయిన్లకు ఫ్యాన్స్‌ అత్యూత్సాహం చేదు అనుభవాన్ని ఇస్తుంది. పలు ఈవెంట్స్‌, షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన హీరోయిన్లను చూసేందుకు, వారితో సెల్ఫీ తీసుకునేందుకు ఫ్యాన్స్‌ ఎగబడటం కామన్‌. కానీ అందులో కొందరు ఆకతాయిల విచిత్ర ప్రవర్తన హీరోయిన్లను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. తాజాగా స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌కు సైతం ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కాజల్‌తో ఓ అభిమాని అభ్యంతరకంగా వ్యవహరించారు.

Continues below advertisement

నడుంపై చేయి వేసి

చూట్టూ బౌన్సర్లు ఉన్న అతడు కాజల్‌ని అసభ్యంగా తాకిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెం.10లో ఓ ఫ్యాషన్‌ వస్త్ర షోరూంను ఒపెనింగ్‌కు కాజల్‌ ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా కాజల్‌ను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. ఇక షాపింగ్‌ మాల్‌ ప్రారంభించిన కాజల్‌ మాల్‌ను వీక్షించింది. అనంతరం షాపింగ్‌ మాల్‌ నిర్వహకులతో ముచ్చటించిన ఆమె అభిమానులకు సెల్ఫీ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో కాజల్‌తో ఫొటో దిగేందుకు వచ్చిన ఓ వ్యక్తి కాజల్‌ నడుముపై చేయి వేశాడు. దీంతో షాకైన కాజల్‌ ఏంటిది అంటూ సీరియస్‌ అయ్యింది. దీంతో బౌన్సర్లు అతడిని దూరంగా జరిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

గతంలోనూ ఇలాంటి అనుభవమే

అయితే గతంలోనూ కాజల్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఇలాగే షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమెను ఓ వ్యక్తి అసభ్యంగా తాకిన సంఘటన అప్పట్లో సంచలనమైంది. తాజాగా మరోసారి కాజల్‌కు ఇలాంటి చేదు సంఘటనే ఎదురవడంతో కాజల్ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఇలాంటివి జనాలు మానుకుంటే బాగుంటుందని, ఆమె ఓ స్టార్‌ హీరోయిన్‌ అనే విషయం మర్చిపోవద్దంటూ సదరు వ్యక్తిని ఉద్దేశిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. స్టార్‌ హీరోయిన్‌తో సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు పద్దతిగా మలుచుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. పెళ్లి అనంతరం కాజల్‌ సినిమాలు బాగా తగ్గించింది. 2020 లాక్‌డౌన్‌ ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది.

ఇండియన్ 2 సినిమాతో బిజీ

ఆ తర్వాత సినిమాలకు బ్రేక్‌ తీసుకున్న ఆమె ఈ గ్యాప్‌లో బిడ్డకకు జన్మనిచ్చింది. 2022లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్‌ బాబుకు నీల్‌ కిచ్లు అని నామకరణం చేసింది. అనంతరం కొంత గ్యాప్‌ తీసుకున్న కాజల్‌ బాలయ్య భగవంత్ కేసరితో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాది రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కాజల్ చేతిలో ఇండియన్ 2 చిత్రం ఉంది. డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా లోకనాయకుడు కమల్ హాసన్ హీరో అనే విషయం తెలిసిందే. ఇందులో కాజల్‌ కమల్‌ హాసన్‌ సరసన నటించనుంది. శంకర్‌ కొన్నేళ్ల క్రితం రూపొందించిన భారతీయుడు సినిమాకి సీక్వెల్‌గా ఇండియన్‌ 2 చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. 

Continues below advertisement