Shah Rukh Khan About hollywood chances: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ దుబాయ్‌‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ గ‌వ‌ర్న‌మెంట్ స‌మ్మిట్ 2024లో పాల్గొన్నారు. ఆ కార్య‌క్ర‌మ‌లో పాల్గొన్న ఆయ‌న త‌న ఆలోచ‌న‌ల‌ను పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా షారుక్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను పొట్టిగా ఉంటాన‌ని, అందుకే జేమ్స్ బాండ్ క్యారెక్ట‌ర్ చేయ‌లేనని చెప్పారు షారుక్. బ్రౌన్‌గా ఉంటాను కాబ‌ట్టి విల‌న్ క్యారెక్ట‌ర్లు చేసేందుకు సిద్ధమే అని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న హాలీవుడ్ సినిమా ఎంట్రీ గురించి కూడా మాట్లాడారు. 


హాలీవుడ్ లో ఛాన్సులు రాలేదు.. 


The Making Of A Star సెష‌న్ లో భాగంగా అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు షారుక్ ఫ‌న్నీ ఆన్స‌ర్స్ ఇచ్చారు. "మీ పేరు ఏంటి"? అని హోస్ట్ అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న "బాండ్ జేమ్స్ బాండ్" అంటూ స‌మాధానం ఇచ్చారు. దీంతో అక్క‌డి వారంతా ఒక్క‌సారిగా న‌వ్వారు. వెంట‌నే "ఆ  క్యారెక్ట‌ర్ లో చేస్తారా?" అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. "నిజం చెప్పాలంటే నాకూ చేయాల‌ని ఉంది. కానీ, నేను చాలా పొట్టిగా ఉంటాను. బ్రౌన్ క‌ల‌ర్ లో ఉంటాను కాబట్టి బాండ్ విల‌న్ గా బాగుంటాను అనుకుంటున్నాను" అని చెప్పారు షారూఖ్.


హాలీవుడ్ ఎంట్రీ గురించి ఆయ‌నను ప్ర‌శ్నించ‌గా.. ‘‘హాలీవుడ్‌ లో ఎంతో మంది ప్రముఖు న‌టీన‌టుల‌తో నాకు పరిచయం ఉంది. వాళ్ల‌తో మాట్లాడుతూ ఉంటాను. కానీ ఇప్పటి వరకూ అక్కడ నటించే అవకాశం రాలేదు.. ఎవ్వ‌రూ అవ‌కాశం ఇవ్వలేదు. ఇది నిజమని చెప్పినా ఎవ్వ‌రూ నమ్మరు. అందుకే మళ్లీ చెబుతున్నా. నాకు హాలీవుడ్ లో ఛాన్స్ రాలేదు. నేను ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు ఎలా అందించాలో ఇంకా నేర్చుకోవాలి’’అని షారుక్ ఖాన్‌ అన్నారు.


స్ల‌మ్ డాగ్ మిలినియ‌ర్ లో ఛాన్స్ వ‌దులుకున్నాను.. 


ఆస్కార్ విన్నింగ్ సినిమా ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’. డానీ బోయిల్ తీసిన ఈ సినిమా గురించి షారుక్ మాట్లాడుతూ.. ‘‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్ లో నటించే ఛాన్స్ వ‌చ్చింది. నేను దానిని తిరస్కరించాను. ఎందుకంటే అప్పటికే నేను ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’కి యాంక‌ర్ గా చేస్తున్నాను. ఈ సినిమా నేను చేయలేనని చెప్పా. తన కంటే గొప్పగా నటించేవారు ఉన్నారని, ఈ పాత్రకు అనిల్‌ కపూర్‌ న్యాయం చేయగలరని బోయిల్‌కు వివరించా’’ అని షారుక్ చెప్పారు. అనిల్ క‌పూర్ న‌టించిన ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ సినిమా ఆస్కార్ లో 8 అవార్డులు ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. 






ఆయ‌న పాత్ర లేదు.. 


ఎనిమిది మంది భారతీయ నేవీ సిబ్బందిని ఇటీవల ఖతార్ విడుదల చేసింది. వారికి ఉరిశిక్ష ప‌డ‌గా.. దాన్ని ర‌ద్దు చేసింది. అయితే, దాని వెనుక షారుక్ ఉన్నార‌ని, ఆయ‌న మాట్లాడారు అనే వార్త వైర‌ల్ అయ్యింది. కాగా.. దాంట్లో నిజం లేద‌ని, ఆయ‌న ప్ర‌మేయం ఏమీ లేద‌ని షారుక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. 


ఇక ప్ర‌స్తుతం షారుక్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమాలో న‌టిస్తుండ‌గా.. పోయిన ఏడాది ఆయ‌న న‌టించిన ‘పఠాన్‌’, ‘జవాన్‌’, ‘డంకీ’  చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాన్ని సాధించాయి. 


Also Read: బుజ్జిత‌ల్లి కాస్తా న‌వ్వ‌వే - సాయి ప‌ల్ల‌వి, నాగ చైత‌న్యల ‘వాలంటైన్స్ డే’ రీల్‌కు నెటిజన్స్ ఫిదా