Sai Pallavi, Naga Chaitanya Valantines day Special wishes: నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి, నాగ చైత‌న్య ఇద్ద‌రు క‌లిసి వాలంటైన్స్ డే విషెస్ చెప్పారు. జపాన్‌లో ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. హైదరాబాద్‌లో ఉన్నా చైతూతో కలిసి.. తమ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ట్విట్ట‌ర్ ద్వారా ఒక క్యూట్ రీల్ ని షేర్ చేశారు. ఇటీవల రిలీజైన ‘తండేల్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో ఉన్న డైలాగ్ తో ఈ రీల్ చేశారు. 


బుజ్జి త‌ల్లి కాస్త న‌వ్వే.. 


‘తండేల్’ సినిమాలో సాయి ప‌ల్ల‌వి, నాగ చైత‌న్య క‌లిసి నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఈ మ‌ధ్యే ఫ‌స్ట గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. దాంట్లో సాయి ప‌ల్ల‌వి.. స‌ముద్ర తీరంలో ఉంటే బుజ్జి త‌ల్లి కాస్త న‌వ్వే.. అంటాడు నాగ‌చైత‌న్య‌. ఆ సీన్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది అంద‌రినీ. ఇప్పుడు దాన్నే చేశారు రీల్‌గా చేశారు.  






జ‌పాన్ లో సాయి ప‌ల్ల‌వి


హీరోగా నాగ చైత‌న్య చేస్తున్న 23వ చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి హీరో కాగా.. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ‌కాకుళం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ఇక చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో సాయి ప‌ల్ల‌వి న‌టిస్తున్న మొద‌టి సినిమా ఇది. ఇప్ప‌టికే నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి కాంబినేష‌న్స్ లో వ‌చ్చిన ‘ల‌వ్ స్టోరీ’ సినిమా పెద్ద హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. 


‘తండేల్’ షూటింగ్‌ షెడ్యూల్ పూర్తి కావడంతో సాయి ప‌ల్ల‌వి అమీర్ ఖాన్ కొడుకుతో క‌లిసి న‌టిస్తున్న బాలీవుడ్ సినిమా కోసం జ‌పాన్ వెళ్లారు. ప్ర‌స్తుతం అక్క‌డే స్నో ఫెస్టివ‌ల్ లో షూటింగ్ జ‌రుగుతోంది. దానికి సంబంధించి ఫొటోలు కూడా వైర‌ల్ గా మారాయి.  చాలా గ్యాప్ తర్వాత సాయి పల్లవి వరుస సినిమాలు చేస్తోంది. తెలుగులో ‘తండేల్’తోపాటు త‌మిళ సినిమా ఎస్ కే - 21లో శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న ఆమె న‌టించ‌నున్నారు. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియ‌సామి దర్శకత్వం వహించనున్నారు. 


శ్రీ‌కాకుళం నుంచి పాకిస్థాన్ వ‌ర‌కు.. 


గుజరాత్‌ రాష్ట్రం సూరత్ లోని ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా 'తండేల్' సినిమా తెరకెక్కుతోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగుతుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుందట. దీని కోసం చిత్ర బృందం చాలా రీసెర్చ్ చేశారు. హీరో నాగ చైతన్య మత్స్యకారుల జీవనశైలి గురించి తెలుసుకోవడమే కాదు.. వారి బాడీ లాంగ్వేజ్ లోకి మారడానికి, సిక్కోలు యాసలో మాట్లాడటానికి చాలా శ్ర‌మించార‌ట‌. నేచుర‌ల్ గా రావ‌డానికి అన్నివిధాల ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ చెప్పింది. 


Also Read: నారా లోకేష్‌కు ఆర్జీవీ ఫ్లయింగ్ కిస్ - ఎన్టీఆర్ కంటే జూనియ‌ర్ ఎన్టీఆరే గొప్ప‌ అంటూ స్టేట్‌మెంట్