Actress Radha : ప్రముఖ సీనియర్ నటి రాధ కూతురు, హీరోయిన్ కార్తీక తాజాగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కూతురు పెళ్లి సందర్భంగా హీరోయిన్ రాధ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేస్తూ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అక్కినేని నాగచైతన్య సరసన 'జోష్'(Josh) సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది కార్తీక. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక తెలుగుతోపాటు తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆకట్టుకునే అందం, మంచి టాలెంట్ ఉన్నా హీరోయిన్ కి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో రాణించలేకపోయింది.
దాంతో సినిమాలు మానేసి దుబాయ్ లో ఉన్న తమ ఫ్యామిలీ హోటల్ బిజినెస్ చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారింది. రీసెంట్ గా తన పెళ్లికి సంబంధించి హింట్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చేతికి ఉంగరం తొడిగి ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది. తను ప్రేమించిన రోహిత్ మీనన్ అనే అబ్బాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపిన కార్తీక రెండు రోజుల క్రితం ప్రియుడితో మూడు ముళ్ళు వేయించుకొని ఏడడుగులు వేసింది. కేరళలోని త్రివేండ్రంలో జరిగిన వీరి వివాహానికి అలనాటి సినీ తారాలంతా హాజరై కొత్తజంటకి తమ ఆశీర్వాదం అందించారు.
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రాధిక, రేవతి తదితరులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. చాలా కాలం తర్వాత వీరంతా కలవడంతో కొన్ని ఫోటోలు దిగారు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కార్తీక పెళ్లికి చిరంజీవి హాజరు కావడానికి ఓ రీజన్ ఉంది. కార్తీక తల్లి సీనియర్ నటి రాధ తో మెగాస్టార్ ఎక్కువ సినిమాలు చేశారు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా ఎక్కువ సినిమాల్లో నటించిన రికార్డు సీనియర్ నటి రాధకు మాత్రమే ఉండడం విశేషం. అప్పట్లోనే తన గ్లామర్ తో హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అందుకున్న రాధ 80, 90 దశకాల్లో వరుస హిట్స్ అందుకుంది.
ఇక ఈమధ్య స్టార్ మా లో ప్రసారమైన 'బీబీ జోడీ'(BB Jodi) అనే డాన్స్ షోకి జడ్జ్ గా కూడా వ్యవహరించారు. ఇదిలా ఉంటే కూతురు పెళ్లి సందర్భంగా రాధ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ మేరకు కూతురు పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది." ఇప్పుడు మీరు జీవిత భాగస్వాములు అయ్యారు. ఇకనుంచి మీ రాబోయే రోజులు అన్ని ప్రేమ, నవ్వు, అంతులేని సాహసాలతో నిండి ఉండాలి. మీ ప్రేమ ఇలాగే స్థిరంగా ఉండి మీరు జీవితకాలం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ రాసుకొచ్చారు సీనియర్ నటి రాధ. ప్రస్తుతం రాధ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read : సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఛత్రపతి హిందీ రిమేక్ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?