Mansoor Trisha Controversy : మన్సూర్ అలీ ఖాన్ ప్రస్తుతం ఈ పేరు కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. తమిళంలో పలు విలక్షణ పాత్రలతో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన రీసెంట్ గా 'లియో'(Leo) మూవీలో నటించాడు. ఇదే సినిమాలో హీరోయిన్ నటించిన త్రిష పై పలు అసభ్యకర వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నాడు. గతంలోనూ కొన్ని వివాదాల్లో చిక్కుకున్న మన్సూర్ అలీ ఖాన్ ఈసారి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన త్రిష గురించి మాట్లాడుతూ.. 'లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందనుకున్నా. నేను గతంలో చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. కానీ త్రిషతో బెడ్ రూమ్ సీన్ మిస్ అయిపోయాను" అంటూ అసభ్యకరంగా కామెంట్స్ చేశాడు. ఇక మన్సూర్ వ్యాఖ్యలపై త్రిష వెంటనే స్పందిస్తూ.." ఇలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోనందుకు ఆనందంగా ఉంది. ఇకపై జీవితంలో అతనితో నటించను. మానవజాతికి మన్సూర్ అలీ ఖాన్ అవమానం" అంటూ ట్వీట్ చేసింది. ఇక మన్సూర్ అలీ కామెంట్స్ పై ఇండస్ట్రీ పెద్దలంతా స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.
ఇప్పటికే కోలీవుడ్ నుంచి లోకేష్ కనగరాజ్, కుష్బూ సుందర్, చిన్మయి, హీరోయిన్ మాళవిక, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తదితరులు మన్సూర్ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ త్రిషకి అండగా నిలిచారు. అలాగే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఇష్యూ పై రియాక్ట్ అవుతూ మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్ ని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఇలాంటి కామెంట్స్ ఏ అమ్మాయికి వచ్చిన తాను అండగా ఉంటానని అన్నారు. మరోవైపు మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలపై నడిగర్ సంఘం అతనిపై తాత్కాలికంగా నిషేధం విధించింది. దీంతో మన్సూర్ అలీ క్షమాపణ చెప్పాలని నడిగర్ సంఘం డిమాండ్ చేస్తుండగా.. తాను ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పేది లేదని, తాను తప్పుగా మాట్లాడలేదని తెగేసి చెప్పారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో మన్సూర్ అలీ మాట్లాడుతూ..
" నడిగర్ సంఘం నాపై నిషేధం విధించి చాలా తప్పు చేసింది. నా నుంచి వివరణ కోరితే బాగుండు. అలాగే నడిగర్ సంగం నిషేధాన్ని వెనక్కి తీసుకోవడానికి మీకే టైం ఇస్తున్నా. సోషల్ మీడియాలో వార్తలు ఎలా అయినా రాయవచ్చు. కానీ తమిళ ప్రజలకు నేనేంటనేది తెలుసు. సినిమాల్లో రేప్ సీన్ ఉంటే నిజంగా ఎవరైనా రేప్ చేస్తారా? అసలు బుద్ధుందా? నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ త్రిషకు క్షమాపణలు చెప్పను" అంటూ స్పష్టం చేశారు.దీంతో మల్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై అటు ఇండస్ట్రీ పెద్దలు, నడిగర్ సంఘం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదిలా ఉంటే మన్సూర్ అలీ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఐపిసి 509B, ఇతర సెక్షన్స్ కింద కేసులు వేసి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
Also Read : 'ధృవ నక్షత్రం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - విక్రమ్ సినిమా ఎలా ఉందంటే?