Chatrapathi OTT Release : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల బాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన 'ఛత్రపతి'(Chathrapathi) మూవీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగు పెట్టాడు ఈ యంగ్ హీరో. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక తాజాగా ఎటువంటి చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు మన తెలుగు హీరోలతో పరభాష దర్శకులు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఇతర భాషల హీరోలు టాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు.


ఇప్పటికే తమిళ స్టార్ హీరోలైన ధనుష్, కార్తికేయన్ స్ట్రైట్ తెలుగు మూవీస్ చేశారు. వీళ్ళతోపాటు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇక మన టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ ప్రెస్టేజియస్ మూవీ 'వార్ 2' లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'అల్లుడు శీను' సినిమాతో తెలుగు వెండితెరకి హీరోగా పరిచయమైన సాయి శ్రీనివాస్ మొదటి సినిమాతోనే డాన్స్, నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కొన్ని కమర్షియల్ సినిమాలు చేసినా అవి పెద్దగా ఆడలేదు. దాంతో బాలీవుడ్ బాటపట్టాడు.


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఇక ఈ రీమేక్ ని మన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్ట్ చేశారు. ఇందులో సాయి శ్రీనివాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ నుస్రత్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. సుమారు రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కనీసం బాక్స్ ఆఫీస్ వద్ద కోటి రూపాయల షేర్ ను కూడా రాబట్టలేక పోయింది. అంత దారుణమైన రిజల్ట్ అందుకుంది ఈ చిత్రం.


నిజానికి ప్రభాస్ నటించిన ఛత్రపతి మూవీ యూట్యూబ్ లో హిందీలో డబ్ అవడంతో దాన్ని అందరూ ముందే చూసేసారు. అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ఛత్రపతి రిమేక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రిలీజ్ అయి చాలా రోజులు అవుతున్నా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఎటువంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా ఎటువంటి హడావుడి లేకుండా ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఛత్రపతి హిందీ రీమేక్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లోనే అతి కష్టంగా చూసిన ఈ సినిమాకి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


Also Read : ఎన్టీఆర్​ 'దేవర'లో మరో బాలీవుడ్ యాక్టర్?