Devara Movie Updates : ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర'(Devara) మూవీలో మరో వర్సటైల్ యాక్టర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఈమధ్య అగ్ర హీరోల సినిమాల్లో విలన్ రోల్స్ లో అదరగొడుతున్న ఆ యాక్టర్ ఇప్పుడు దేవరలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరో తెలుసా? 'ఆర్ ఆర్ ఆర్' తో పాన్ ఇండియా హిట్ అందుకొని గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర'(Devara) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'జనతా గ్యారేజ్' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో 'దేవర' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్(Janvi Kapoor) ఈ సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచాయి. బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా కనిపించనున్నాడు. రీసెంట్ గా ఈ మూవీలో మంచు లక్ష్మి కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే మేకర్స్ నుంచి దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం 'దేవర' మూవీలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట.


సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఈ న్యూస్ పై మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. సినిమాలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం తెలియడంతో ఫ్యాన్స్ లో దేవరపై అంచనాలు మరింత పెరిగాయి. మరి త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇప్పటికే సంజయ్ దత్ సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. 'కేజీఎఫ్ 2' లో విలన్ గా అదరగొట్టిన సంజయ్ దత్ రీసెంట్ గా 'లియో' మూవీలో కనిపించిన విషయం తెలిసిందే.


ప్రస్తుతం పూరి జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డబల్ ఇస్మార్ట్'(Double Ismart)లోనూ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. అలాగే ప్రభాస్ - మారుతి కాంబినేషన్ మూవీలోనూ నటిస్తున్నట్లు తెలిసింది.  ఇక రీసెంట్ గా గోవాలో జరిగిన షెడ్యూల్లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ లపై ఓ పాటని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.


రెండు భాగాలుగా రాబోతున్న దేవర పార్ట్-1 వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యవసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రత్న వేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీ యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ పనిచేస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.


Also Read : పూనమ్ టార్గెట్ మెగాస్టారేనా? - త్రిష, మన్సూర్ గొడవలో చిరు మద్దతుపై విమర్శలు?