హీరోలు నిర్మాతలుగా మారడం ఎన్టీఆర్, ఏయన్నార్ కాలం నుంచి చూస్తున్నాం. ఆ రోజుల్లో హీరోయిన్లూ సినిమాలు నిర్మించారు. తెలుగు తెరకు ఎన్టీఆర్ పరిచయమైన సినిమా నిర్మాత కృష్ణవేణి హీరోయినే కదా! అయితే... తర్వాత తర్వాత చలన చిత్ర నిర్మాణంలో మహిళల సంఖ్య తగ్గుతోంది. ఈ మధ్య కథానాయికలు కొందరు సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టారు. ఆ జాబితాలో సీనియర్ నటి జయలలిత కూడా చేరారు.
జయలలిత సమర్పణలో 'రుద్రంకోట'
సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహరిస్తూ... కీలక పాత్రలో నటించిన తెలుగు సినిమా 'రుద్రంకోట' (Rudramkota Movie). ఏఆర్‌కే విజువల్స్ పతాకంపై అనిల్ ఆర్కా కండవల్లి నిర్మించారు. రాము కోన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనీల్, విభీష, అలేఖ్య హీరో హీరోయిన్లు. ఈ నెల (సెప్టెంబర్) 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హీరో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
'పంచదార చిలక'తో జయలలితతో నటించా - శ్రీకాంత్!
జయలలిత గారితో కలిసి తాను 'పంచదార చిలక' సినిమాలో నటించానని హీరో శ్రీకాంత్ తెలిపారు. ఆమె చాలా వ్యక్తి అని, ఆమె నిర్మించిన 'రుద్రంకోట' పెద్ద విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇంకా శ్రీకాంత్ మాట్లాడుతూ ''ఇప్పుడు ఏ సినిమా హిట్ అయితే అది పెద్ద సినిమా. 'రుద్రంకోట'లో పాటలు బావున్నాయి. ట్రైలర్ కూడా బావుంది. దర్శకుడు రాము ఎన్నో సీరియల్స్ చేశారు. ఆయనకు చాలా అనుభవం ఉంది. ఆయనతో పాటు సినిమా టీమ్ అందరు పెద్ద హిట్ అందుకోవాలని ఆశిస్తున్నా'' అని చెప్పారు. అనిల్ తనకు నిర్మాతగా తెలుసు అని, ఎప్పుడూ ఆయనలో ఇంత మంచి డ్యాన్సర్ ఉన్నాడని అనుకోలేదని, ఆయనతో సుచిత్ర గారు చక్కగా చేయించారని నటి రాశి చెప్పారు. జయమ్మ (జయలలిత) నిర్మించిన 'రుద్రంకోట' విజయం సాధిస్తుందని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
రెండు పాటలకు కొరియోగ్రఫీ చేసిన శివశంకర్!
'రుద్రంకోట' సినిమాలో రెండు పాటలకు దివంగత నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారని సీనియర్ నటి, చిత్ర సమర్పకురాలు జయలలిత తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ... ''ఇంత మంది వచ్చి మా సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. శుక్రవారం థియేటర్లలో సినిమా చూసి హిట్ చేయాలని కోరుతున్నా'' అని చెప్పారు.
Also Read : ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?
ఇల్లీగల్ రిలేషన్ వల్ల పిల్లలకు ఎదురయ్యే సమస్యలతో పాటు ప్రేమ, కామం నేపథ్యంలో 'రుద్రంకోట' సినిమా తీసినట్లు దర్శకుడు రాము తెలిపారు. కోటి నేపథ్య సంగీతం ఇవ్వడం, సాగర్ పాటలు రాయడం తన అదృష్టమని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు.
Also Read : మహేష్, చరణ్ నవ్వులు... అరవింద్, అశ్వినీదత్, దిల్ రాజు ముచ్చట్లు - ఏఎన్నార్ విగ్రహావిష్కరణలో స్టార్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial