యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన నటుడు సుహాన్. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆయన టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. చిన్ని చిన్న పాత్రలు పోషించాడు. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్నాడు. కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.   


‘కేబుల్ రెడ్డి’ మూవీ నుంచి కీలక అప్ డేట్


రీసెంట్ గా ‘రైటర్ పద్మభూషన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరిలో విడుదలైన సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ‘హిట్ 2’ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. అమాయకుడిగా కనిపిస్తూనే క్రూరంగా హత్యలు చేసే వ్యక్తి పాత్ర పోషించాడు. పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయిన నటిస్తాడు సుహాన్. ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘కేబుల్ రెడ్డి’. శ్రీధర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా కీలక అప్ డేట్ ఇచ్చారు.  


రేపు ‘కేబుల్ రెడ్డి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల


‘కేబుల్ రెడ్డి’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు(సెప్టెంబర్ 21) విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఉదయం 11.43 నిమిషాలకు ఈ పోస్టర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “కేబుల్ రెడ్డి ఫస్ట్ లుక్ రేపు ఉదయం 11.43కు విడుదల. అందరూ చూస్తూనే ఉండండి” అంటూ రాసుకొచ్చారు.  ఇక ఈ సినిమా ఓ పట్ణణంలో జరిగే కథ నేపథ్యంలో కొనసాగుతుందని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఆసక్తికర స్క్రీన్‌ ప్లేతో, ఆద్యంతం హాస్యరస భరితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.






శరవేగంగా కొనసాగుతున్న షూటింగ్


‘కేబుల్ రెడ్డి’ సినిమాలో సుహాస్‌ సరసన  షాలిని కొండేపూడి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీధర్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ గా ఆయనకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను ఫ్యాన్‌ మేడ్‌ ఫిల్మ్స్‌  పతాకంపై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ పైనా మేకర్స్ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.   ఈ చిత్రానికి మహిరెడ్డి పండుగల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంగీత దర్శకుడిగా స్మరణ్‌ సాయి, ఆర్ట్‌ డైరెక్టర్ గా క్రాంతి ప్రియం వ్యవహరిస్తున్నారు.


Read Also: 49 లక్షల బడ్జెట్, 2 వేల కోట్ల వసూళ్లు - బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ గురించి మీకు తెలుసా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial