సీనియర్ నటుడు అర్జున్‌ సర్జా పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ త్వరలోనే పెళ్ళి పీటలెక్కనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తమిళ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, హీరో ఉమాపతితో ఆమె ఏడడుగులు వేయబోతున్నారని ఇప్పటికే ధృవీకరంచబడింది. వీరి వివాహానికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఈరోజు శుక్రవారం ఐశ్వర్య - ఉమాపతిల నిశ్చితార్థం జరిగింది.


ఐశ్వర్య అర్జున్, ఉమాపతిలు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలో వీరి ఎంగేజ్మెంట్ సింపుల్ గా జరిగింది. అర్జున్ స్వయంగా నిర్మించిన హనుమాన్ టెంపుల్ లోనే వీరు ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. 


ఉమాపతి - ఐశ్వర్య అర్జున్ ల నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధు మిత్రులు, పలువురు సినీ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. అర్జున్, తంబి రామయ్యలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో నెట్టింట వైరల్ గా మారాయి.





Also Read: 'బిగ్‌ బాస్‌ బోగస్ అన్నప్పుడే నేను వెళ్లకుండా ఉండాల్సింది'.. సీజన్-2 విన్నర్ కౌశల్ కామెంట్స్ వైరల్!


తమిళంలో అర్జున్‌ హోస్ట్ గా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో ఉమాపతి పాల్గొన్నాడు. అప్పుడే ఐశ్వర్యతో పరిచయం ఏర్పడటం, తర్వాతి రోజుల్లో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడం జరిగింది. ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఏర్పడటంతో, వీరి పెళ్లికి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. 


కుమారుడు ఉమాపతి తన ప్రేమ విషయం చెప్పిన వెంటనే ఒప్పుకున్నానని, తనకు చాలా సంతోషంగా ఉందని తంబి రామయ్య ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఉమాపతి పుట్టినరోజు సందర్భంగా నవంబరు 8న పెళ్లి తేదీని ప్రకటిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, థాయ్ లాండ్ లో ఐశ్వర్య - ఉమాపతిల వివాహం జరిపించాలని అనుకుంటున్నారట.


కాగా, తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్రాల్లో నటించిన అర్జున్.. యాక్షన్ కింగ్ గా తనదైన ముద్ర వేసుకున్నారు. తన మేనల్లుళ్లు చిరంజీవి, ధృవలతో పాటుగా కుమార్తె ఐశ్వర్యను కూడా సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. తండ్రి ఆశీస్సులతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య.. తమిళ కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు చేసింది. అవి ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు ఆశించినంత గుర్తింపు రాలేదు. 


ఈ నేపథ్యంలో కూతుర్ని టాలీవుడ్ లో లాంచ్ చేయాలని నిర్ణయించుకున్న అర్జున్.. తన స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్ - ఐశ్వర్యలతో ఓ బైలింగ్వల్ మూవీ ప్లాన్ చేశారు. పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభించారు. అయితే దర్శక హీరోల మధ్య కమ్యూనికషన్ ప్రాబ్లమ్ వల్ల అది కార్యరూపం దాల్చలేదు. వేరే హీరోతో ఆ సినిమాని పూర్తి చేస్తానని అర్జున్ ప్రకటించారు కానీ, ఆ ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఐశ్వర్య పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. మ్యారేజ్ తర్వాత కూడా అర్జున్ కూతురు సినిమాల్లో కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి.



Also Read: ఓవైపు యాక్షన్, మరోవైపు డైరెక్షన్ - యాక్టర్స్‌గా రాణిస్తున్న డైరెక్టర్స్ వీరే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial