కౌశల్‌ మండా గురించి టాలీవుడ్ ఆడియన్స్ కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న నటుడాయన. సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్, సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేస్తూ వచ్చిన కౌశల్.. బిగ్ బాస్ షోతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని కోసం ఒక ఆర్మీ ఏర్పడిందంటేనే ఎంతటి క్రేజ్ తెచ్చుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఎలా అయితేనేం ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడమే కాదు, టైటిల్ కూడా గెలుచుకొని రెండో సీజన్ విజేతగా బయటకి వచ్చాడు. అయితే అదే సమయంలో అతనిపై నెగెటివిటీ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో కౌశల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 


కౌశల్ మాట్లాడుతూ.. "ఎవరైనా నా గురించి నెగటివ్ గా మాట్లాడినా, నెగటివ్ గా గెలికినా నాకు ఎక్కడో టచ్ అవుద్ది. నా అనుభవం అంత వయసు లేని దీప్తి సునయన 'కౌశలా.. రెండు వారాల్లో వెళ్ళిపోతాడు' అనే మాట అన్నది. ఎప్పుడైతే నాని అది టీవీలో చూపించారో అప్పుడే నేనోంటో, కౌశల్ అంటే ఏంటో వీళ్ళతో పాటుగా ఈ ప్రపంచానికి చూపించాలని అనుకున్నా. రెండు వారాల్లో నేను వెళ్ళిపోతానని నా ప్రోమో కూడా రెడీ చేశారు. కానీ ఫ్రైడే రోజు నైట్ 11 గంటలకు ఓటింగ్ క్లోజ్ అవుతుందనే టైమ్ లో ఆ నిమ్మ కాయ ఎపిసోడ్ రిలీజ్ అవ్వడం, ఆ ఒక్క గంటలో నా రాత మారిపోయింది. అదంతా నా లక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ నిమ్మకాయ అప్పుడు పిండకుండా తర్వాతి ఎపిసోడ్స్ లో పిండి ఉంటే నేను అప్పటికి ఉండేవాడిని కాదు. అది లక్ తోనే నాకు జరిగింది" అని అన్నారు.


Also Read: మీడియాకు క్షమాపణలు చెప్పిన యాంకర్‌ సుమ.. ఎందుకంటే?


'బిగ్ బాస్ షో ఒక బోగస్' అంటూ అప్పట్లో ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో కౌశల్ పాల్గొనడంపై స్పందించారు. తప్పుడు స్టేట్‌మెంట్స్ తీసుకుని తనను స్టూడియోకి రమ్మని ఏవేవో చేశారని అన్నారు. బిగ్‌ బాస్‌ బోగస్ అని పెట్టినప్పుడే తాను ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఉండాల్సిందన్నారు. కానీ ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారు కాబట్టి, మన సైడ్ నుంచి తప్పేం లేదు కాబట్టి, అందులో నిజం లేదని చెప్పడానికే ఆ స్టూడియోకి వెళ్లానని తెలిపారు. తాను ఇలాంటివేవీ పెద్దగా పట్టించుకోనని, కానీ ఈ విషయాన్ని మాత్రం కొంచెం ఎక్కువగా పట్టించుకోను అన్నారు. కొన్ని లక్షల, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు.. వీళ్ళు చెప్పింది నిజమని నమ్ముతారేమో అని, అది తప్పని తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ ఛానల్ కి వెళ్ళడం జరిగిందన్నారు. లేకపోతే అసలు వెళ్లకపోయేవాడి కాదని, ట్రోల్స్ చేస్తే చేశారులే అని వదిలేసుకుంటే అయిపోయేదని వివరణ ఇచ్చారు.


బిగ్‌ బాస్‌ ముందు గానీ, తర్వాత గానీ ప్రజలను ఎడ్యుకేట్ చేయడాన్నే తాను ఇష్టపడతానని కౌశల్ మండా తెలిపారు. స్వతహాగా తాను సంపాదించుకున్న ఫ్యాషన్ అనే విద్యను చాలా మందికి పంచానని చెప్పారు. ఇప్పటివరకు 3 వేల మందిని మోడల్స్‌ గా తీర్చిదిద్దానన్నారు. ఫ్యూచర్ లో యాక్టర్ గా సెటిల్ అవ్వాలని తనకు ఎప్పుడూ లేదని, ఫ్యాషన్‌ కు సంబంధించి కాలేజీ ఏర్పాటు చేయాలనేది తన లక్ష్యమని చెప్పారు. అవకాశం వస్తే యాక్టింగ్ చేస్తానని, అంతేకానీ దాని వెనుక పరిగెత్తనని స్పష్టం చేశారు. తనకు తెలిసిన ఫ్యాషన్‌ విద్యను పది మందికి అందించేందుకు కృషి చేసేందుకు ప్రయత్నిస్తున్నానని కౌశల్ చెప్పుకొచ్చారు.



Also Read: ‘లీలమ్మో.. శ్రీలీలమ్మో’.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన ‘ఆదికేశవ’ జోడీ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial