మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్.రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. లేటెస్టుగా ‘లీలమ్మో’ అనే సాంగ్ ను లాంచ్ చేసారు.
‘ఆదికేశవ’ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘సిత్తరాల సిత్రావతి’, ‘హే బుజ్జి బంగారం’ పాటలు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన ఈవెంట్ లో 'లీలమ్మో' అనే మూడో పాటను ఆవిష్కరించారు. మాస్ జనాలను దృష్టిలో పెట్టుకొని చిత్రీకరించిన ఈ పాట, ఇన్స్టెంట్ గా టార్గెట్ ఆడియన్స్ ను రీచ్ అయిందనే చెప్పాలి.
'లీలమ్మో.. లీలమ్మో.. లవ్లీగా చూస్తావా' అంటూ సాగే ఈ పాటలో శ్రీలీల, వైష్ణవ్ తేజ్ మాస్ డ్యాన్స్ లతో అదరగొట్టారు. ముఖ్యంగా శ్రీలీలా మరోసారి తన ఎనర్జిటిక్ స్టెప్పులతో రెచ్చి పోయింది. మొదటి మూడు సినిమాల్లో డ్యాన్స్ కోసం పెద్దగా కష్టపడని వైష్ణవ్.. ఈ సాంగ్ లో మాత్రం శ్రీలీలకు పోటీ ఇవ్వడానికి గట్టిగా ట్రై చేసాడు. కలర్ ఫుల్ సెట్, సెటప్‌కు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ లో ఇద్దరూ ఆకట్టుకున్నారు.
'లీలమ్మో' పాటకు జీవీ ప్రకాశ్ మాసీ ట్యూన్‌ని కంపోజ్ చేయగా.. దీనికి లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. సింగర్స్ నకాష్ అజిజ్, ఇంద్రావతి చౌహాన్ కలిసి ఎంతో హుషారుగా ఆలపించారు. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయగా.. డడ్లీ, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేసారు.
‘లీలమ్మో’ పాట విడుదల సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. ఇది తనకెంతో ఇష్టమైన పాట అని చెప్పింది. తన పేరుతో ఉన్న తొలి పాట ఇదని, అందుకే తనకు మరింత ప్రత్యేకమైన గీతంగా నిలిచిపోతుందని అంది. ఇది అసలైన మాస్ పాట.. వినగానే నాగిని డ్యాన్స్ చేయాలనిపించింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. వైష్ణవ్ తేజ్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు అని శ్రీలీల తెలిపింది. షూటింగ్ అంతా సరదాగా సాగిపోతుందని, సినిమా కూడా సరదా సరదాగా ఉంటుందని వైష్ణవ్ అన్నారు.
జానికి ‘ఆదికేశవ’ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. బాక్సాఫీస్ వద్ద క్లాష్ ని నివారించడానికి పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. 2023 నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆ మధ్య విడుదలైన టీజర్ ఆకట్టుకోగా, త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.
Also Read: మీడియాకు క్షమాపణలు చెప్పిన యాంకర్ సుమ.. ఎందుకంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial