Seerat Kapoor With Rakul Brother Aman: సినీ పరిశ్రమలో ఏ హీరో.. ఏ హీరోయిన్‌తో కమిట్ అవుతున్నాడు అనే విషయం ప్రేక్షకుల దగ్గర నుండి ఎక్కువ రోజులు దాగదు. కానీ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే వారు అఫీషియల్‌గా అనౌన్స్ చేసేవరకు ఇలాంటి విషయాలు బయటికి రావు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టుగా ఒక తెలుగు హీరోయిన్ ప్రకటించింది. తను మరెవరో కాదు ‘సేవ్ ది టైగర్స్ 2’ ఫేమ్ సీరత్ కపూర్. సీరత్.. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూసి అప్పుడే వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యిందేమో అని ప్రేక్షకుల్లో సందేహం మొదలయ్యింది. ఏప్రిల్ 1న రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం బయటికొచ్చింది.


హీరోగా ప్రయత్నాలు..


తెలుగులో ‘కెరటం’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద స్టార్లతో జోడీకట్టింది. కానీ అనుకోకుండా టాలీవుడ్‌లో తన కెరీర్ ఎండ్ అయిపోయింది. దాంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిపోయింది. అక్కడే జాకీ భగ్నానీతో ప్రేమలో పడి తాజాగా పెళ్లి కూడా చేసుకుంది. ఇక రకుల్ హీరోయిన్‌గా ఫుల్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు తన తమ్ముడు అమన్ సింగ్‌ను కూడా హీరోగా లాంచ్ చేసింది. అమన్ హీరోగా ఒకట్రెండు సినిమాల్లో నటించాడు కూడా. కానీ ఈ ఇండస్ట్రీలో తను సక్సెస్ అవ్వకపోవడంతో హీరోగా తన కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాడు. తాజాగా హీరోయిన్ సీరత్ కపూర్‌‌తో అమన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం బయటపడింది.


ఎంగేజ్‌మెంట్ ఫోటో.?


అమాన్ పుట్టినరోజు సందర్భంగా సీరత్ కపూర్ ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ‘ఈరోజు నువ్వు నా జీవితంలో ఉన్నందుకు కాస్త ఎక్స్‌ట్రా అదృష్టంగా భావిస్తున్నాను. సరే.. ఈరోజు మాత్రమే కాదు.. ప్రతీరోజూ అలాగే అనుకుంటున్నాను. నువ్వు నా ఫేవరెట్ వ్యక్తివి. హ్యాపీ బర్త్ డే మై పార్ట్‌నర్ ఇన్ క్రైమ్, నా బద్మాష్ మిస్టర్ అమాన్’ అంటూ అమాన్‌తో క్లోజ్‌గా దిగిన ఫోటోను షేర్ చేసింది సీరత్ కపూర్. ఈ ఫోటోలో వారి బట్టలు చూస్తుంటే వీరికి ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయిందేమో అని నెటిజన్లు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు సీరత్ కపూర్, అమాన్ రిలేషన్‌షిప్ విషయం ఎప్పుడూ బయటికి రాలేదు. అందుకే ఈ విషయం చాలామందిని షాక్‌కు గురిచేసింది.






టాలీవుడ్‌లో క్రేజ్..


బాలీవుడ్‌లో ఆఫ్ స్క్రీన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన సీరత్ కపూర్.. తెలుగులోని ‘రన్ రాజా రన్’తో హీరోయిన్‌గా మారింది. అది తన మొదటి సినిమానే అయినా క్యూట్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అలా తెలుగులో యంగ్ హీరోల సరసన తనకు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు కూడా వచ్చాయి. గ్లామర్ పాత్రలకు కూడా నో చెప్పకపోవడంతో మేకర్స్ అంతా తనకు ఛాన్సులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ గత కొన్నేళ్ల నుండి సీరత్.. సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. తాజాగా ‘సేవ్ ది టైగర్స్ 2’తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది ఈ భామ. ప్రస్తుతం సీరత్.. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. ఇదే సమయంలో రకుల్ తమ్ముడు అమన్‌తో తన రిలేషన్‌షిప్‌ను కన్ఫర్మ్ చేసింది సీరత్.


Also Read: వాళ్లు నన్ను ఏ పని చేసుకోనివ్వడం లేదు, ఇంట్లో గొడవలు కూడా జరుగుతున్నాయి: చిరంజీవి