ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు సినిమా ధియేటర్లలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.  ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా తెలితే అక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. ఇలా  దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ పదుల సంఖ్యలో ధియేటర్లను సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో ఒక్క రోజే ఏకంగా 52 ధియేటర్లు సీజ్ చేశారు. అనుమతుల రెన్యూవల్ నిబంధనలు పాటించలేదని  నోటీసులు ఇచ్చారు. ఇలా నోటీసులు ఇచ్చిన వెంటనే వాటిని మూసివేయించారు. థియేటర్లలో మౌలిక సదుపాయాల కల్పన, అధిక ధరలు వసూలు, లైసెన్స్ పై దృష్టి కపెట్టామని.. అధికారులు తెలిపారు. ప్రజలు సైతం  థియేటర్లపై ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు ప్రకటించారు. 


Also Read: అమెరికాలో రికార్డులను తిరగరాస్తున్న ఆర్ఆర్ఆర్... జోరుగా ప్రీబుకింగ్స్


పెద్ద ఎత్తున ధియేటర్లను సీజ్ చేయడంతో  జాయింట్ కలెక్టర్ రాజబాబు ను కలిసిన ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ కలిశారు. అన్ని నిబంధనలు పాటిస్తే రెండు రోజుల్లో ధియేటర్లను రెన్యూవల్ చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.  ఇతర జిల్లాల్లోనూ అధికారులు తనిఖీలు చేశారు.  జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, ఎస్పీలు, డీఎస్పీలు, తహసీల్దార్ల వరకు రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు థియేటర్ల తనిఖీలు చేస్తున్నారు. జీవో 30 ప్రకారం థియేటర్లలో ఉండాల్సిన వసతులు, టికెట్ల ధరలు, క్యాంటీన్‌లో విక్రయించే తినుబండారాల ధరలను, థియేటర్ల నిర్వహణకు వివిధ శాఖలు జారీ చేసిన అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నారు. 


Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్


ప్రభుత్వ ఆదేశాల మేరకే తనిఖీలు నిర్వహిస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంచినీటి సీసాలను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని, నిబంధనలు పాటించలేదని కొన్ని థియేటర్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. మరికొన్నింటినీ సీజ్ చేస్తున్నారు. పలు చోట్ల జరిమానాలు విధిస్తున్నారు. అధికారుల తనిఖీలతో సినిమా హాళ్ల యజమానుల్లో ఆందోళన నెలకొంది.  దీంతో పలువురు ధియేటర్ల యజమానులు స్వచ్చందంగా మూసివేయాలని నిర్ణయించకున్నారు. ఈ కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో సినిమా హాళ్లు మూతపడ్డాయి. 


Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!


పలు చోట్ల ఎగ్జిబిటర్లు ప్రభుత్వ వేధింపులను తట్టుకోలేమని.. టిక్కెట్ రేట్లు గిట్టుబాటు కావని చెబుతూ.. మూసేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పండగ సీజన్ కావడంతో సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయి. ఇలాంటి సమయంలో తనిఖీల పేరుతో ధియేటర్లను సీజ్ చేస్తూండటంతో టాలీవుడ్‌లోనూ ఆందోళన నెలకొంది. మొత్తంగా చూస్తే ఏపీలోసినీ పరిశ్రమ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ధియేటర్ యాజమాన్యాలు ప్రత్యేకంగా సమావేశమై.. ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నాయి. 


Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి