ప్రజెంట్ సొసైటీలో ట్రెండింగ్ టాపిక్ ఏది? భార్యల చేతుల్లో బలైపోతున్న భర్తలు! వివాహితుల చేతిలో ప్రాణాలు కోల్పోతున్న భర్తల కంటే... భార్యల చేతిలో గృహ హింస ఎదుర్కొంటున్న భర్తల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. భార్య బాధితుల సంఘాలూ ఉన్నాయ్. ఆ ట్రెండింగ్ టాపిక్ మీద తెరకెక్కిన సినిమా 'సతీ లీలావతి'.
మొగుడ్ని కొట్టిన భార్య...రిటర్న్ కౌంటర్లతో లావణ్య!మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi Konidela) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'సతీ లీలావతి'. ఆమెకు జంటగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గా దేవి పిక్చర్స్ పతాకంపై నాగమోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'భీమిలీ కబడ్డీ జట్టు', 'ఎస్‌ఎంఎస్' (శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా 'సతీ లీలావతి' టీజర్ విడుదల చేశారు.
లావణ్య, దేవ్ మోహన్ పెళ్లి సన్నివేశాలతో 'సతీ లీలావతి' టీజర్ ప్రారంభమైంది. ఆ వెంటనే దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చినట్టు చూపించారు. 'నాకు ఎందుకో హ్యాపీగా లేనప్పుడు... మనం విడిపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది' అని దేవ్ మోహన్ చెబుతారు. ఆ తర్వాత అతడిని కుర్చీలో కట్టేసిన విజువల్స్ వచ్చాయి. 'లీలా... నన్ను కొట్టవా?' అని దేవ్ మోహన్ అడగ్గా... 'ఏం డౌటా?' అని లావణ్య త్రిపాఠి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ బావుంది. మొగుడ్ని భార్య కొట్టినట్టు చూపించడం, అలాగే వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్ కామెడీ సైతం ఆకట్టుకునేలా ఉంది. కొత్త జంట / భార్య, భర్త మధ్య నడుమ గొడవలతో పాటు అనుబంధాన్ని ఎమోషనల్‌గానే కాకుండా ఎంటర్‌టైనింగ్‌గానూ తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది. అసలు ఈ కథ ఏమిటో తెలుసుకోవాలంటే త్వరలో థియేటర్లలో విడుదల అయ్యే సినిమా చూడాలని మేకర్స్ చెబుతున్నారు.
'సతీ లీలావతి' చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ 'సతీ లీలావతి' అని నిర్మాత తెలిపారు.
Also Read: తెలుగు 'బిగ్ బాస్'లో కన్నడ హీరోయిన్... లాస్ట్ ఇయర్ ఛాన్స్ మిస్, ఈసారి పక్కా!
Sathi Leelavathi Movie Cast And Crew Telugu: లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో వీకే నరేష్ (సీనియర్ నరేష్), వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మాటలు: ఉదయ్ పొట్టిపాడు, కళా దర్శకుడు: కోసనం విఠల్, కూర్పు: సతీష్ సూర్య, ఛాయాగ్రహణం: బినేంద్ర మీనన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, నిర్మాణ సంస్థ: దుర్గాదేవి పిక్చర్స్, నిర్మాత: నాగ మోహన్, దర్శకత్వం: తాతినేని సత్య.