Natural star Nani Saripodhaa Sanivaaram :'హాయ్ నాన్న' సినిమా సూప‌ర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. 'స‌రిపోదా శ‌నివారం' అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే రిలీజైన ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అయితే, శ‌నివారం రోజున మూవీ టీమ్ ఇచ్చిన అప్ డేట్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. యాక్ష‌న్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్న‌ట్లుగా ఫొటో షేర్ చేసింది చిత్ర బృందం.  


'స్థిర శనివారం సమవర్తి'.. 


వెరైటీ పోస్ట్ ల‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు మేక‌ర్స్. అలా ఈ నెల 18న షూటింగ్ మ‌ళ్లీ మొద‌ల‌వుతుంద‌ని ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. ప్ర‌తి శ‌నివారం ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ఇప్పుడు మ‌రో అప్ డేట్ ఇచ్చారు. 'స్థిర శ‌నివారం స‌మ‌వ‌ర్తి' అంటూ నాని చేతికి ర‌క్తం కారుతున్న ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోల‌ను బ‌ట్టి యాక్ష‌న్ సీక్వెన్స్ షూట్ జ‌రుగుతున్న‌ట్లు అర్థం అవుతోంది. 






 


విల‌న్ గా ఎస్.జె సూర్య


ఈ సినిమాని టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. 'జెంటిల్ మ్యాన్' తర్వాత వీరిద్దరూ జోడీగా నటిస్తున్న చిత్రమిది. దర్శక నటుడు ఎస్.జె సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా నాని కెరీర్ లో 31వ సినిమా. పాన్ ఇండియా లెవెల్ లో దీన్ని రిలీజ్ చేయ‌నున్నారు. భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్నారు ఈ సినిమాని. ‘అంటే సుందరానికి’ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు కామెడీ ఎంటర్టైనర్లు, రొమాంటిక్ లవ్ స్టోరీలతో అలరించిన వివేక్.. ఇప్పుడు విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌ తో వస్తున్నారు. ఇందులో నానిని మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారు. 


డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మురళి.జి  సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. 'సరిపోదా శనివారం' చిత్రాన్ని 2024 ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.



రిలీజ్ కి ముందే ఈ సినిమాకి మంచి క్రేజ్ వ‌చ్చింద‌నే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ తో పాటుగా నాన్-థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయ‌ని ఫిలిమ్ న‌గ‌ర్ లో టాక్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా థియేట్రికల్ హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్‍ రాజుకు చెందిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ దక్కించుకుంది. ఓటీటీ దిగ్గజం నెట్‍ ఫ్లిక్స్ ఈ మూవీ అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దాదాపు రూ. 40 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 


Also Read: క్షయ వ్యాధి అంటురోగమా? ఎలా సంక్రమిస్తుంది? ముందుగా కనిపించే లక్షణాలేమిటీ?