Priyadarshi's Sarangapani Jathakam Review: విమర్శకుల ప్రశంసలతో పాటు కథానాయకుడిగా విజయాలు అందుకున్న యువ తెలుగు నటుడు ప్రియదర్శి. ఇటీవల 'కోర్టు'తో విజయం అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'సారంగపాణి జాతకం'. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూశారా? 

రెండు వారాలలో కడిగిన ముత్యంలా వస్తాడా? లేదా?జాతకాలను నమ్మే యువకుడు సారంగపాణి. అతడికి ఒక ప్రేయసి ఉంటుంది. తన చేతిలో రేఖలను ఎక్కువగా నమ్మే సారంగపాణికి పెళ్లి విషయంలో ఒక సమస్య ఎదురవుతుంది. రెండు వారాలలో కడిగిన ముత్యంలా బయటకు వస్తే... ఎంగేజ్మెంట్ రింగ్ చేతికి ఉంటుందని, లేదంటే అంతే సంగతులు అని కాబోయే భార్య క్లియర్ కట్ కింద చెప్పేస్తుంది.

సారంగపాణి పెళ్లికి వచ్చిన సమస్య ఏమిటి? దానిని అతడు ఎలా సాల్వ్ చేసుకున్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ ట్రైలర్ చూస్తే... కామెడీ ఫుల్లుగా ఉంటుందని అర్థం అవుతోంది. ప్రియదర్శికి తోడు వెన్నెల కిషోర్, హర్ష చెముడు నవ్వించారని సీన్స్ చూసి చెప్పవచ్చు. 'నువ్వొక్కడివే చేసుకోవడానికి ఇది హస్త ప్రయోగం కాదు... హత్య ప్రయత్నం' అని 'వెన్నెల' కిషోర్ చెప్పే డైలాగ్ ట్రైలర్ మొత్తం మీద హైలైట్. మిగతా సీన్లు కూడా బాగున్నాయి. కథ ఏమిటి అనేది క్లారిటీ ఇవ్వకుండా సినిమా మీద ఆసక్తి కలిగించేలా ట్రైలర్ కట్ చేశారు.

Also Read: వెంకీతో త్రివిక్రమ్... సందీప్ రెడ్డి వంగాతో రామ్ చరణ్... ఈ రెండూ ఒక్కటే!

ఏప్రిల్ 25న థియేటర్లలోకి 'సారంగపాణి జాతకం'Sarangapani Jathakam Release Date: 'సారంగపాణి జాతకం' చిత్రాన్ని ఏప్రిల్ 25న థియేటర్లలోకి తీసుకు రానున్నారు. మొదట ఈ వారం విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే వచ్చే వారం థియేటర్లలో పోటీ లేకపోవడంతో అప్పటికి సినిమాను షిఫ్ట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే... 'కోర్టు' తర్వాత ప్రియదర్శి మరో విజయం అందుకునేలా కనబడుతోంది.

Also Read'హనుమాన్' నిర్మాతను ఆ దర్శకులు ఇద్దరు ఛీట్ చేశారా? ఛాంబర్ మెట్లు ఎక్కిన వివాదం??

'జెంటిల్మెన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన చిత్రమిది. ఇందులో రూపాయి కొడువయూర్ హీరోయిన్. సీనియర్ నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణ.