'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి. ప్రస్తుతం సుప్రీమ్ స్టార్ సాయి దుర్గా తేజ్ హీరోగా 'సంబరాల యేటి గట్టు' ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇదీ పాన్ ఇండియా సినిమాయే. ఉన్నట్టుండి నిరంజన్ రెడ్డి పేరు వార్తల్లోకి వచ్చింది. అయితే... అది కొత్త సినిమాల గురించి కాదు. ఆల్రెడీ చేసేసిన సినిమాల గురించి!

'హనుమాన్' ప్రశాంత్ వర్మతో ఆల్ ఈజ్ వెల్!దర్శకుడు ప్రశాంత్ వర్మ నమ్మకంతో భారీ నిర్మాణ వ్యయంతో కే నిరంజన్ రెడ్డి హనుమాన్ సినిమా తీశారు. విడుదలకు ముందు థియేటర్ల సమస్య కూడా ఎదుర్కొన్నారు. కష్టాలు పడి ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు వచ్చారు. విడుదల తర్వాత కష్టాలను మరిచిపోయేలా చేసింది హనుమాన్ సక్సెస్. రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. నిర్మాతగా నిరంజన్ రెడ్డికి లాభాలు తెచ్చింది. ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో ఆయనకు సంత్సంబంధాలు లేవని ఒక పుకారు మొదలైంది. దానికి కారణం ఏమిటంటే... 

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా 'హనుమాన్' సీక్వెల్ 'జై హనుమాన్' రూపొందిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై నిర్మాణంలో ఆ సినిమా తెరకెక్కుతోంది. 'హనుమాన్' తర్వాత సీక్వెల్‌కు ప్రొడ్యూసర్లు మారారు. తనతో కాకుండా మరో నిర్మాతతో ప్రశాంత్ వర్మ చేస్తున్నందుకు నిరంజన్ రెడ్డి ఫీల్ అయ్యారని గుసగుసలు మొదలు అయ్యాయి. అయితే... అందులో నిజం లేదని తెలిసింది. 'హనుమాన్' చేయాలని అనుకున్నప్పుడు ఒక్క సినిమాకు మాత్రమే ప్రశాంత్ వర్మ కమిట్ అయ్యారట. సీక్వెల్ ప్రొడక్షన్ మైత్రీ మూవీ మేకర్స్‌ దగ్గరకు వెళుతున్న సంగతి ముందు నిరంజన్ రెడ్డికి చెప్పారట.

Also Read: 'జైలర్ 2'లో బాలకృష్ణ... రజనీకాంత్ సినిమా గురించి శివన్న ఏం చెప్పారంటే?

విజయ్ సేతుపతితో పూరి చేసే సినిమా డిస్ట్రిబ్యూట్ చేసే ఛాన్స్‌!?'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఉస్తాద్ రామ్‌ పోతినేని హీరోగా ఆ సినిమా సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' చేశారు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 40 కోట్లు ఇచ్చి మరి నిరంజన్ రెడ్డి తీసుకున్నారు. అయితే థియేటర్ల దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. అందుకని పూరి జగన్నాథ్, చార్మి కౌర్ పట్ల నిరంజన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారని పుకారు మొదలైంది. దర్శకులు ప్రశాంత్ వర్మ, పూరి జగన్నాథ్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిలిం ఛాంబర్ మెట్లు ఎక్కినట్టు ప్రచారం మొదలైంది. ఆ వార్తల్లో కొంచెం కూడా నిజం లేదని టాక్. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాను నిరంజన్ రెడ్డి డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం లేకపోలేదని ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. వివాదాలకు దూరంగా ఉండాలని మనస్తత్వం నిరంజన్ రెడ్డిది అని, ఆయనపై వస్తున్న వార్తలలో నిజం లేదని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వర్గాల నుంచి వినపడుతున్న మాట. ప్రస్తుతం షికారు చేస్తున్న పుకార్లలో నిజం లేదు. అదీ సంగతి.

Also Readఓటీటీలను నమ్ముకుని సినిమా తీయకూడదు... 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' నిర్మాతలు సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా ఇంటర్వ్యూ