Shivaraj kumar: 'సప్తసాగరాలు దాటి' సైడ్‌ - ఏ, సైడ్‌ -బి రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా గత ఏడాది బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. తెలుగులో పాటు.. సౌత్‌లో మంచి టాక్‌ వచ్చింది ఈ సినిమాకి. ఇక ఆ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ హేమంత్ ఎం రావు, కన్నడ స్టార్‌హీరో శివరాజ్ కుమార్ కలిసి సినిమా చేయనున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ మొదలు కాబోతున్నట్లు హేమంత్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 


ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌.. 


కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ హీరోగా హేమంత్ ఎం రావు త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న‌ట్లు స‌మాచారం. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ జె గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైశాక్‌ ఏ గౌడ నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. శివరాజ్‌కుమార్‌ లాంటి స్టార్‌తో తన తొలిచిత్రం చేయడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత అన్నారు. ఈ ప్రాజెక్ట్ తనపై భాధ్యతను పెంచిందని చెప్పారు. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.


డిఫరెంట్‌ జానర్‌లతో ప్రేక్షకుల ముందుకు


'సప్తసాగరాలు దాటి' సినిమా దర్శకుడు ఎప్పటికప్పుడు ప్రేక్షకులను డిఫరెంట్‌ మూవీస్‌తో అలరిస్తుంటారు. 'గోధి బన్న సాధారణ మైకట్టు  కవలుదారి', 'భీమ సేన నల మహారాజు', సప్త సాగరాలు దాటి లాంటి సినిమాలు తీసి సక్సెస్‌ అయ్యారు హేమంత్‌ ఎం రావు. ఇక ఇప్పుడు శివకుమార్‌తో యాక్ష‌న్ సినిమా చేయ‌నుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమాకి సంబంధించి మిగతా వివరాలు ఏం తెలియరాలేదు. దీంతో సినిమా ఎలా ఉండబోతుందో? దాన్ని దర్శకుడు ఎలా తెరకెక్కిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 






కన్నడలో వచ్చి.. తెలుగులో హిట్‌ కొట్టి..


2023లో వచ్చిన 'సప్తసాగరాలు దాటి' రెండు పార్ట్స్‌ సూపర్‌హిట్‌గా నిలిచాయి. చార్లీ ఫేమ్‌ రక్షిత్‌ శెట్టి, రుక్మిణి నటించిన ఈ సినిమా కన్నడలో రిలీజై.. ఆ తర్వాత తెలుగులో వచ్చింది. పోయిన ఏడాది బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. క‌న్న‌డ నుంచి వ‌చ్చిన ఈ సినిమా తెలుగుతో పాటు సౌత్ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. మొదటి భాగంలో చక్కటి లవ్‌స్టోరీ, హీరో, హీరోయిన్‌ విడిపోవడం చూపించారు.  సప్త సాగరాలు దాటి సైడ్ ఏ’లో వయొలెన్స్ ఎక్కువగా చూపించని దర్శకుడు హేమంత్.. సైడ్ బీలో మాత్రం మోతాదు పెంచాడు. ప్రస్తుతం ఈ సినిమాలు అమెజాన్‌ ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతున్నాయి.


Also Read: ఆ సీన్‌ పడుంటే.. థియేటర్లు బద్దలయ్యేవేమో..!