Sandeep Reddy Vanga About Prabhas Spirit Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో 'స్పిరిట్' (Spirit) మూవీ రాబోతుందన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్ డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో మూవీ షూటింగ్‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు సందీప్ రెడ్డి.
అప్పుడే షూటింగ్ స్టార్ట్
యూఎస్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందీప్ రెడ్డిని.. యాంకర్ స్పిరిట్ అప్ డేట్స్ ఇవ్వాలంటూ అడిగారు. దీనికి స్పందించిన ఆయన.. తాను వన్ డే ఈవెంట్ కోసం మెక్సికో వచ్చానని.. తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతానని చెప్పారు. ఇదే బిగ్ అప్ డేట్ అని.. చిత్రీకరణ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని.. అక్కడే షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఈ మూవీ అనౌన్స్‌మెంట్ అయిన క్షణం నుంచీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా.? అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Also Read: 'ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ'గా ఆమని - ఫస్ట్ లుక్ రివీల్.. మూవీ టీం గొప్ప నిర్ణయం
3 డిఫరెంట్ లుక్స్‌లో..
అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీలతో ఫేమస్ అయ్యారు సందీప్ రెడ్డి వంగా. ఆయన సినిమా తీస్తే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే అనే రేంజ్‌లో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రేంజ్‌కు అనుగుణంగా మూడు డిఫరెంట్ లుక్స్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్ తరహాలోనే మాస్ లుక్‌లో ప్రభాస్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఆయన తన కెరీర్‌లో తొలిసారి ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారు. ఈ మూవీని టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్.. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
బిజీ బిజీగా ప్రభాస్
మరోవైపు, రెబస్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సమ్మర్‌లోనే 'స్పిరిట్' మూవీని సైతం పట్టాలెక్కిస్తున్నారు. ఇటీవలే హను రాఘవపూడితో సినిమా ప్రారంభమైనా అది షూటింగ్ ప్రారంభం అయ్యేందుకు చాలా టైం పట్టనుంది. మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజాసాబ్' (The Raja Saab) మూవీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ లోడ్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రీసెంట్‌గానే డైరెక్టర్ మారుతి హింట్ ఇచ్చారు.