Aamani's Dokka Seethamma First Look Unveiled: తెలుగు తెరపై మరో మహనీయురాలి బయోపిక్ రానుంది. తనకున్న వందల ఎకరాల అమ్మి ఎంతోమంది పేదల ఆకలి తీర్చి ఆంధ్రుల అన్నపూర్ణగా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు డొక్కా సీతమ్మ. ఈమె జీవిత కథ ఆధారంగా 'ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ' (Andhrula Annapurna Dokka Seethamma) మూవీని తెరకెక్కిస్తున్నారు.

సీతమ్మగా ఆమని ఫస్ట్ లుక్

డొక్కా సీతమ్మగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని (Aamani) నటిస్తున్నారు. దీనికి  సంబంధించి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సీతమ్మలాగే తెల్లచీర, గుండుతో కుర్చీలో కూర్చుని కనిపించారు ఆమని. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలే ఆమె నారి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు బయోపిక్‌లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఈ మూవీని ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు నిర్మిస్తుండగా.. టీ.వీ.రవి నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు మురళీమోహన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాకు కార్తీక్ కోడకండ్ల మ్యూజిక్ అందిస్తున్నారు. 

Also Read: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..

టీం గొప్ప నిర్ణయం

టైటిల్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా మూవీ టీం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు వచ్చిన ప్రతి రూపాయిని ఏపీ ప్రభుత్వానికి విరాళంగా ఇస్తామని దర్శకుడు రవి నారాయణ్ ప్రకటించారు. 'అందరిలాగే మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి అభిమానిగా మారి 2012లో ఇండస్ట్రీలోకి వచ్చాను. ఫస్ట్ సినిమా డొక్కా సీతమ్మ వంటి మహనీయురాలైన కథతో చేస్తుండడం నా అదృష్టం. పవన్ కల్యాణ్ అభిమానిగా ఓ మంచి పని చేయాలని అనుకునే నాకు డొక్కా సీతమ్మ గురించి ఆయన చెప్పిన మాటలు నాలో స్ఫూర్తి నింపాయి.

ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ రూపాయిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు విరాళంగా ఇస్తాం. 'డొక్కా సీతమ్మ' పేరుపై ఉన్న పథకానికి ఈ డబ్బులు వినియోగించేలా చూడాలని కోరతాం.' అని నారాయణ్ తెలిపారు.

నాకీ ఛాన్స్ రావడం అదృష్టం

డొక్కా సీతమ్మ వంటి మహనీయురాలి పాత్రలో నటించే ఛాన్స్ రావడం తన అదృష్టమని సీనియర్ నటి ఆమని తెలిపారు. తాను బెంగుళూరులోనే ఎక్కువగా ఉన్నానని.. డొక్కా సీతమ్మ గురించి తనకు ఎక్కువగా తెలియదని చెప్పారు. దర్శకుడు కథ చెప్పిన తర్వాత ఆమె గురించి సెర్చ్ చేసి ఎక్కువగా తెలుసుకున్నానని.. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తో తనకు అర్థమైందని అన్నారు. ఈ పాత్ర చేయాలంటే రాసిపెట్టి ఉండాలని పేర్కొన్నారు.