Megastar Chiranjeevi Anil Ravipudi Movie Started: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ఓ కొత్త మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఈ మూవీ వేడుక ప్రారంభం అయ్యింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, వెంకటేష్, దిల్ రాజు, నాగబాబు సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 

వర్కింగ్ టైటిల్స్ ఇవే..

ఈ మూవీని #Mega157 (మెగా 157), #ChiruAnil (చిరు అనిల్) వర్కింగ్ టైటిల్స్‌తో తెరకెక్కించనున్నారు. పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలు ప్రారంభమైనా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేది మాత్రం వేసవి తర్వాతే అని తెలుస్తోంది. వేడుకలో చిరంజీవి సహా వెంకటేష్, విజయేంద్రప్రసాద్ ఇతర ప్రముఖులు సందడి చేశారు. ఎండలు తగ్గిన తర్వాతే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ లోపే మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' పనులు చేయాలని భావిస్తున్నారట.

Also Read: చిరు ‘ఠాగూర్’, బాలయ్య ‘లెజెండ్’ టు వెంకీ ‘సైంధవ్’, మహేష్ ‘గుంటూరు కారం’ వరకు - ఈ ఆదివారం (మార్చి 30) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ 

వచ్చే ఏడాది సంక్రాంతికి..

మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన 'శంకర వరప్రసాద్'గా నటించనున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే అనిల్ బిగ్ అప్ డేట్ ఇచ్చారు. 'సంక్రాంతికి వస్తున్నాం' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అనిల్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం కామెడీ, యాక్షన్ అంశాల మేళవింపుగా రూపొందనుందని తెలుస్తోంది.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండగా.. ఓ రోల్ కోసం అదితిరావు హైదరి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి తర్వాత ఆ రేంజ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తోన్న దర్శకుడు అనిల్, మెగాస్టార్ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

టైటిల్ అదేనా..

ఈ మూవీ టైటిల్‌పైనా అందరిలోనూ భారీ హైప్ నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాకు 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్ పెట్టాలని చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజైతే ఈ టైటిల్ పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని అంతా భావిస్తున్నారు. మరి ఈ సినిమాకు టైటిల్ ఏం ఫిక్స్ చేస్తారో అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. 

హీరో రోల్ ఏంటంటే?

ఈ మూవీలో హీరో రోల్ గురించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ ఇందులో RAW ఏజెంట్‌ అని యూనిట్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయితే, జెడ్ ప్లస్ సెక్యూరిటీ మధ్య కమాండో చీఫ్ కింద కనిపిస్తారని మరో టాక్ సైతం వినిపిస్తోంది.

వెంకీ కీలక రోల్

ఈ సినిమాలో వెంకీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సినీ వర్గాల టాక్. చిరు, వెంకీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. మూవీలో ఓ కీలక రోల్ కోసం ఆయన్ను సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. పూజా కార్యక్రమానికి సైతం వెంకీ హాజరు కాగా సినిమాలో ఆయన నటిస్తున్నారనే వార్తలకు బలం చేకూరింది.