Actress Abhinaya Marriage With Sunny Verma: ప్రముఖ నటి 'అభినయ' (Abhinaya) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. తనకు కాబోయే భర్తను ఆమె సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సన్నీ వర్మ అనే వ్యక్తితో ఈ నెల 9న నిశ్చితార్థం జరిగినట్లు చెప్పారు. త్వరలో తాను వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నానని కాబోయే భర్తతో కలిసి గుడి గంటలు కొడుతున్న ఫోటోను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
చిన్న నాటి స్నేహితులు
అభినయ, సన్నీవర్మ (Sunny Verma) చిన్న నాటి స్నేహితులు అని తెలుస్తోంది. గత 15 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సమాచారం. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. సన్నీ వర్మ తన చిన్న నాటి స్నేహితుడని.. 15 ఏళ్లుగా తమకు పరిచయమని చెప్పారు. త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. సన్నీ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఓ మల్టీ నేషనల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్లు, భవనాలు, నీటి పారుదల, ఎలక్ట్రికల్, మైనింగ్, రైల్వేల నిర్మాణంలో భాగమైన ఓ ఇంటర్నేషనల్ సంస్థలో జాబ్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
పుట్టుకతోనే చెవిటి, మూగ అయినప్పటికీ నటి అభినయ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. టాలీవుడ్‌లో 'నేనింతే' సినిమాతో ఆమె పరిచయం అయ్యారు. ఆ తర్వాత కింగ్, శంభో శివ శంభో సినిమాల్లో నటించి మెప్పించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్న పాత్ర చేసినా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ పలు సినిమాల్లో ఆమె నటిస్తున్నారు.