Sampoornesh Babu's Sodharaa Movie Release Date: కామెడీ జోనర్‌లోనే విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నటుడు సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu). ఈసారి సరికొత్తగా అన్నదమ్ముల అనుబంధంతో మరో మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఏప్రిల్ 11న రిలీజ్

అన్నదమ్ముల అనుబంధంతో పాటు కామెడీ ప్రధానాంశంగా.. సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'సోదరా' (Sodharaa). ఏప్రిల్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. సినిమాలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చంద్ర చగంలా ఈ మూవీని నిర్మిస్తుండగా.. మన్‌మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: నీలోని నటుడికి మరో కొత్త కోణం - 'పెద్ది'లో చరణ్ లుక్‌పై మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే?

తెలుగు చిత్ర సీమలో ఎందరో సోదరులున్నారని.. అలాంటి అన్నదమ్ముల బంధానికి మా 'సోదరా' చిత్రం అద్దం పడుతుందని దర్శకుడు మన్మోహన్ మేనంపల్లి తెలిపారు. అన్నదమ్ముల బంధంతో పాటు ఎమోషన్, కామెడీ అన్నీ కలగలిపి సినిమా ఉంటుందని అన్నారు. అటు.. ఈ సినిమా ద్వారా సంపూర్ణేష్‌లోని మరో కోణాన్ని ప్రేక్షకులు చూస్తారంటూ నిర్మాత చంద్ర అన్నారు. ఆయన నుంచి ఆశిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్ కూడా మూవీలో ఉంటుందని చెప్పారు.