Megastar Chiranjeevi Responds On Ram Charan's Peddi First Look: తన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆయనకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెష్ తెలిపారు. ఈ క్రమంలో 'పెద్ది' మూవీలో ఫస్ట్ లుక్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.

మెగాస్టార్ ఏమన్నారంటే?

'పెద్ది' (Peddi) మూవీ పోస్టర్‌లో చరణ్ లుక్ చాలా అద్భుతంగా ఉందని మెగాస్టార్ కొనియాడారు. సినీ ప్రియులకు ఇది తప్పకుండా ఓ మంచి ట్రీట్ అవుతుందని అన్నారు. 'మై డియర్ చరణ్ హ్యాపీ బర్త్ డే. 'పెద్ది' చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తుంది. నీలోని నటుడిని మరో కొత్త కోణంలో ఇది ఆవిష్కరిస్తోంది. ఫ్యాన్స్‌కు ఇది కనులపండుగ కానుందని నమ్ముతున్నా.' అని చిరంజీవి పేర్కొన్నారు.

Also Read: 'పుష్ప 2' కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా? - శ్రీలీల స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ వేరే లెవల్..

చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్..

మెగా పవర్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేం బుచ్చిబాబు (Buchibabu) కాంబోలో మూవీకి 'పెద్ది' అనే టైటిల్ ఖరారు చేశారు. చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా టీం రిలీజ్ చేసింది. బీడీ కాలుస్తూ.. ముక్కుకు రింగుతో గెడ్డంతో ఆయన లుక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. 'ఓ మనిషి.. ప్రకృతికి ఓ శక్తి' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ మ్యాచ్ జరుగుతున్నట్లుగా ఉండగా.. ఓ ఫైట్ సీన్‌లో లుక్ అని అర్థమవుతోంది. మూవీలో ఆయన రోల్ డిఫరెంట్‌గా ఉండనున్నట్లు లుక్‌ను బట్టి తెలుస్తోంది.

సినిమాలో ఆయన పేరు కూడా 'పెద్ది' అనే టాక్ నడుస్తోంది. గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో క్రికెట్ ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చరణ్ సరసన హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఆమె లుక్ రివీల్ చేయగా ఆకట్టుకుంటోంది. మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా.. ఇప్పుడు గ్లింప్స్‌పై మరింత ఆసక్తి నెలకొంది.