Pushpa 2 Kissik Song: 'పుష్ప 2' కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా? - శ్రీలీల స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ వేరే లెవల్..
Pushpa 2 Movie: పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ యూత్‌ను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. శ్రీలీల గ్లామర్, స్టెప్పులతో ఈ సాంగ్ ట్రెండింగ్‌గా నిలిచింది. తాజాగా కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియోను టీం రిలీజ్ చేసింది.

Allu Arjun's Pushpa 2 Movie Kissik Song Making Video Unveiled: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ కాంబో 'పుష్ప 2' (Pushpa 2) బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. 'పుష్ప'లో 'ఊ అంటావా.. ఉఊ అంటావా మామ..' సాంగ్ ఓ ఊపు ఊపేసింది. యూట్యూబ్‌లో అప్పట్లో ట్రెండ్ సృష్టించింది. అలాగే.. 'పుష్ప 2' మూవీలో 'కిస్ కిస్ కిస్సిక్' (Kissik Song) సాంగ్ సైతం అదే ట్రెండ్ కొనసాగించింది.
మేకింగ్ వీడియో చూశారా..
'కిస్ కిస్ కిస్సిక్..' అంటూ ముద్దుగుమ్మ శ్రీలీల స్టెప్పులు, గ్లామర్ యువతను ఉర్రూతలూగించాయి. పాటలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ పాట కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండగా.. అత్యంత వేగంగా ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న దక్షిణాది పాటగా కిస్సిక్ రికార్డు సృష్టించింది. తాజాగా మేకర్స్ 'కిస్సిక్' సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.
ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. చంద్రబోస్ లిరిక్స్ రాశారు. సింగర్ సుభాషిణి ఆలపించగా.. ఇప్పటికే ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా.. మేకింగ్ వీడియో సైతం రిలీజ్ చేయడంతో ట్రెండింగ్‌గా మారింది. బన్నీ డ్యాన్స్.. శ్రీలీల రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్, స్టెప్పులు అదుర్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప ప్రాంఛైజీలో భాగంగా వచ్చిన పుష్ప, పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2024లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా 'పుష్ప 2' రికార్డులు సృష్టించింది. మూవీ విడుదలైన 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలిచింది. బన్నీ సరసన శ్రీవల్లిగా నేషనల్ క్రష్ రష్మిక మంధన్న నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్ చిత్రాన్ని నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ హైప్ తీసుకొచ్చింది.
మరోవైపు.. ఓటీటీలో ఇప్పటికీ 'పుష్ప 2' హవా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో జనవరి 30 నుంచి మూవీ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇంగ్షీష్ వెర్షన్‌తో పాటు బ్రెజీలియన్, పోర్చుగీస్, ఇండోనేషియా, పోలిష్, స్పానిష్, థాయ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సబ్ టైటిల్స్ ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉన్నాయి.
పుష్ప 3 ఎప్పుడంటే..?
ఈ క్రమంలో 'పుష్ప 3' ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2028లో 'పుష్ప 3' రిలీజ్ చేస్తామని.. ఇటీవల ఓ ప్రెస్ మీట్‌లో నిర్మాత రవిశంకర్ తెలిపారు. నిజానికి పుష్ప 2 మూవీకి సీక్వెల్‌పై క్లైమాక్స్‌లోనే డైరెక్టర్ సుకుమార్ హింట్ ఇచ్చేశారు. పుష్ప రాజ్‌పై ఓ వ్యక్తి బాంబు దాడికి పాల్పడిన సీన్‌తో సినిమాను సస్పెన్స్‌గా ముగించారు. దీంతో 'పుష్ప 3: ది ర్యాంపేజ్'పై ఫ్యాన్స్ అంచనాలతో పాటు ఆసక్తి సైతం పెరిగింది. ఫస్ట్ రెండు పార్టులను మించేలా మూడో పార్ట్ ఉంటుందనేది మాత్రం స్పష్టమవుతోంది.