Empuraan Twitter Review - ఎల్2 ఎంపురాన్ ట్విట్టర్ రివ్యూ: క్లైమాక్స్ తర్వాత సీన్ మిస్ అవ్వొద్దు... ఇదీ సోషల్ మీడియాలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సినిమా టాక్
L2 Empuraan Twitter Review: మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'ఎల్ 2 ఎంపురాన్' ప్రీమియర్ షోస్ పడ్డాయి. మరి సోషల్ మీడియాలో సినిమా టాక్ ఎలా ఉందో తెలుసుకోండి.

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) హీరోగా నటించిన 'ఎల్ 2 ఎంపురాన్' (లూసిఫర్ సీక్వెల్) ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు భారీ ఓపెనింగ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరి థియేటర్లలో రెస్పాన్స్ ఎలా ఉంది? పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? తెలుసుకోండి
ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది...
క్లైమాక్స్ అయితే కుమ్మేసింది!
L2 Empuraan Twitter Review: 'ఎల్ 2 ఎంపురాన్' సినిమా చూసిన జనాలు అందరూ చెప్పే మాట ఒక్కటే... క్లైమాక్స్ కుమ్మేసిందని! థియేటర్ల నుంచి ప్రేక్షకులను బయటకు పంపించే ముందు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ భారీ హై ఇచ్చి పంపించారట. అంతకుముందు ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిందని అంటున్నారు.
ఇంటర్వెల్ వరకు కథ చెప్పడం మీద ఎక్కువ కాన్సెంట్రేట్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్, ఆ తరువాత సెకండాఫ్ ను పరుగులు పెట్టించారట. క్లైమాక్స్ అయితే అవుట్ స్టాండింగ్ అంటున్నారు.
పోస్ట్ క్రెడిట్ సీన్ అసలు మిస్ కావొద్దు!
రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలలో 'ఎల్ 2 ఎంపురాన్' ఒకటి అవుతుందని ఆల్రెడీ ప్రీమియర్ షోస్ చూసిన వాళ్ళ చెబుతున్నారు. క్లైమాక్స్ అయిపోయిన వెంటనే సీట్ల నుంచి లేచి బయటకు రావద్దని, పోస్ట్ క్రెడిట్ సీన్ అసలు మిస్ కావద్దని తెలిపారు. 'ఎల్ 2 ఎంపురాన్' సీక్వెల్ కోసం క్లైమాక్స్ తర్వాత ఒక సర్ప్రైజ్ సీన్ ప్లాన్ చేశారట. అది మరింత బావుంటుందని చెబుతున్నారు.
Also Read: విక్రమ్ సినిమాకు ఢిల్లీ హైకోర్టు షాక్... 'వీర ధీర శూర' రిలీజ్ మీద స్టే
మోహన్ లాల్ నటన గురించి చెప్పేది ఏముంది? ఆయన అద్భుతంగా చేశారని, మిగతా తారాగణంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియర్, అభిమన్యు సింగ్ తదితరులు సైతం బాగా చేశారని టాక్.
Also Read: ఎల్2 ఎంపురాన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా హిట్టేనా? లూసిఫర్ సీక్వెల్ టాక్ ఎలా ఉందంటే?
మలయాళ సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ రికార్డులలో విడుదలకు ముందు 'ఎల్ 2 ఎంపురాన్' భారీ రికార్డు క్రియేట్ చేసింది. ఓపెనింగ్ డే కలెక్షన్స్ 50 కోట్ల రూపాయలకు పైగా నమోదు చేసింది. ఇప్పటి వరకు మాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో హైయెస్ట్ ఓపెనింగ్ డే ఇదే.