Empuraan Collection Prediction: మలయాళ సినిమా 'బాహుబలి' మోహన్ లాల్... 'ఎంపురాన్'కు భారీ ఓపెనింగ్, నయా రికార్డ్స్
Empuraan Box Office Collection Prediction: మలయాళ సినిమా ఇండస్ట్రీకి మోహన్ లాల్ 'ఎంపురాన్' సినిమా బాహుబలి అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఓపెనింగ్ డే భారీ రికార్డులు క్రియేట్ చేసిందీ సినిమా.

L2 Empuraan first day collection worldwide: మలయాళ సినిమా ఇండస్ట్రీలో మోహన్ లాల్ కొత్త సినిమా 'ఎల్ 2 ఎంపురాన్' సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదటి రోజు 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి మలయాళ సినిమాగా రికార్డులకు ఎక్కనుంది. ప్రీ సేల్స్ ద్వారా ఈ సినిమా నయా చరిత్రకు శ్రీకారం చుట్టింది.
ఓపెనింగ్ వీకెండ్ 85 కోట్ల గ్యారంటీ!
మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన సినిమా 'ఎల్ 2 ఎంపురాన్'. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన 'లూసిఫర్'కు సీక్వెల్ ఇది. దీనిపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ అంచనాలను అందుకుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి.
'ఎల్ 2 ఎంపురాన్' ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ 52 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మలయాళ సినిమాలో ఇది భారీ రికార్డ్. దీనిని నమోదు చేసిన మొదటి హీరో మోహన్ లాల్. దీనికి ముందు 'మరక్కార్' పేరిట హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్ రికార్డు ఉంది. మొదటి రోజు ఆ సినిమా వసూళ్లు 20 కోట్లు. అది కూడా మోహన్ లాల్ సినిమాయే. దానికి రెండున్నర రెట్లు ఓపెనింగ్ డే కలెక్షన్ రాబట్టింది 'లూసిఫర్ 2'.
కేరళ బాక్సాఫీస్ బరిలోనూ ఈ సినిమా ఆల్ టైం హైయెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసింది. మొన్నటి వరకు ఆ రికార్డు దళపతి విజయ్ 'లియో' పేరిట ఉంది. ఇప్పుడు 'ఎల్ 2'కి ఒక్క కేరళలో మొదటి రోజు 12:50 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. మిగతా రాష్ట్రాలలో మొదటి రోజు 6 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇవాళ సాయంత్రానికి ఈ నెంబర్స్ మరింత పెరగవచ్చు. ఓవర్సీస్ ద్వారా మొదటి రోజు 30 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.
మార్చి 27వ తేదీ నుంచి మార్చి 30 వరకు... ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా కలెక్షన్స్ 85 కోట్ల రూపాయలకు పైగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఇండియన్ సినిమా మార్కెట్లో 36 కోట్ల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టింది. ఓవర్సీస్ ద్వారా ఈ సినిమాకు 49 కోట్ల రూపాయలు ఫస్ట్ వీకెండ్ వస్తాయని ప్రీ సేల్స్ ద్వారా తెలిసింది.
Also Read: ఎల్2 ఎంపురాన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా హిట్టేనా? లూసిఫర్ సీక్వెల్ టాక్ ఎలా ఉందంటే?
మలయాళ సినిమా పరిశ్రమలో 'ఎల్ 2 ఎంపురాన్' కనివిని ఎరుగని ఓపెనింగ్ డే కలెక్షన్ రికార్డులు క్రియేట్ చేసింది. మాలీవుడ్ వరకు ఈ సినిమాను బాహుబలి అని పేర్కొనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పరంగా మిగతా మలయాళ హీరోలకు అందనంత ఎత్తులో ఇప్పుడు మోహన్ లాల్ ఉన్నారు. ఫస్ట్ డే 52 కోట్ల దగ్గర ఆగుతుందా? మరింత పెరుగుతుందా? అనేది గురువారం (మార్చి 27వ తేదీ) సాయంత్రానికి తెలుస్తుంది. బుక్ మై షో, పేటీఎం వంటి బుకింగ్ సైట్స్ చూస్తే సినిమా బజ్ భారీగా ఉంది.