L2 Empuraan First Review: ఎల్2 ఎంపురాన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా హిట్టేనా? లూసిఫర్ సీక్వెల్ టాక్ ఎలా ఉందంటే?
L2 Empuraan First Review Telugu: మలయాళ సినిమా కనివిని ఎరుగని బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి 'ఎల్ 2 ఎంపురాన్' రెడీ అయింది. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అది ఎలా ఉందో తెలుసా?

మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ (Mohan Lal) కథానాయకుడిగా నటించిన సినిమా 'లూసిఫర్'. దాంతో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకుడిగా పరిచయం అయ్యారు. మలయాళంతో పాటు ఇతర భాషలలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఆ సినిమాకు సీక్వెల్ తీశారు, అదీ భారీ ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో! మలయాళ చిత్ర సీమ కనివిని ఎరుగని భారీ ఓపెనింగ్ రికార్డు క్రియేట్ చేయడానికి రెడీ అయ్యింది 'ఎల్ 2 ఎంపురాన్' (L2 Empuraan). ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఎర్లీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసా?
బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్...
యాక్షన్ & ఎంగేజ్ చేసేలా!
L2 Empuraan First Review: సౌత్ ఇండియాలో రాజకీయ నేపథ్యంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాలలో 'ఎల్ 2 ఎంపురాన్' ఒకటి అని ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. సినిమా ఎర్లీ రివ్యూస్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయని, అదే సమయంలో సినిమా బాగా ఎంగేజ్ చేస్తుందని చెబుతున్నారు.
'ఎల్ 2'కి క్లైమాక్స్ ప్లస్...
స్క్రీన్ ప్లే కూడా సర్ప్రైజ్ చేసేలా!
'లూసిఫర్' సినిమా తీసేటప్పుడే మూడు భాగాలుగా తీయాలని తాము అనుకున్నట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పారు. మోహన్ లాల్ సైతం 'ఎల్ 2' విజయం సాధిస్తే దీనికి సీక్వెల్ కూడా తీస్తామని హింట్ ఇచ్చారు. అందుకు కారణం ఉందట. ఈ సినిమాకు సీక్వెల్ కోసం క్లైమాక్స్ భారీ ఎత్తున డిజైన్ చేశారని తెలిసింది. 'ఎల్ 2'కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ క్లైమాక్స్ అని సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. స్క్రీన్ ప్లే సైతం చాలా ఎంగేజ్ చేసేలా ఉందట.
హీరోగా మోహన్ లాల్...
దర్శకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్!
సినిమాలో మెయిన్ హీరో మోహన్ లాల్! ఆయన ఇమేజ్ గురించి, కేరళతో పాటు దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'జైలర్' సినిమాలో ఆయన కనిపించింది కాసేపే అయినా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించారు. డాన్ రోల్ మోహన్ లాల్ చేస్తే ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో... దర్శకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ అటువంటి క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారట. హీరోగా మోహన్ లాల్, దర్శకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ అదరగొట్టారని టాక్.
Also Read: చిరంజీవి - అనిల్ సినిమా ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు... పండక్కి స్పెషల్ ప్లాన్?
'లూసిఫర్' కథ గుర్తుందా?
'గాడ్ ఫాదర్'కు కాస్త డిఫరెంట్!
'లూసిఫర్' కథ గుర్తుందా? ఆ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్ చేశారు. అయితే మలయాళ సినిమాతో పోలిస్తే కాస్త మార్పులు చేర్పులు చేశారు. ఒరిజినల్ వెర్షన్ ఎలా ఉంటుంది అనే విషయంలోకి వెళితే... కేరళలో ముఖ్యమంత్రి మరణిస్తారు. ఆ సమయంలో కుర్చీ కోసం చాలా మంది రాజకీయాలు చేస్తారు. సీఎం కుమార్తెకు రెండో భర్తగా వచ్చిన ఒక వ్యక్తి రాష్ట్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తే, సవతి కుమార్తెను లైంగికంగా వేధిస్తే... అప్పటి వరకు దూరం పెట్టిన తన సవతి సోదరుడిని సీఎం కుమార్తె సహాయం కోరుతుంది. స్టీఫెన్ గట్టుపల్లిగా ఒక సాధారణ రాజకీయ నేతగా ఉన్న మోహన్ లాల్, తన సవతి తమ్ముడిని సీఎం కుర్చిలో కూర్చోబెడతాడు. ముంబై మాఫియాను సైతం శాసించే వరల్డ్ డాన్ అబ్రహం ఖురేషి పాత్రలో సినిమాను ముగించి సీక్వెల్ మీద అంచనాలు పెంచారు.
'ఎల్ 2 ఎంపురాన్' విషయానికి వస్తే... కేరళలో మళ్లీ ఎన్నికలు వస్తాయి. స్టీఫెన్ గట్టుపల్లి అలియాస్ అబ్రహం ఖురేషి ఏం చేశాడు? ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన సంస్థలు ఆయన కోసం చేసిన అన్వేషణలో ఏం తెలుసుకున్నాయి? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.