మెగా అభిమానులు అందరికీ ఒక గిఫ్ట్ రెడీ అయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ఎలా ఉండబోతుందనేది కొంచెం పరిచయం చేయనున్నారు. ఫస్ట్‌ లుక్ (RC16 First Look) విడుదల చేయడానికి దర్శకుడు బుచ్చిబాబు సానా రెడీ అయ్యారు.

చరణ్ బర్త్ డే గిఫ్ట్... టైం లాక్ చేశారుRC16 Movie Update: రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'పెద్ది' (Peddi Movie) టైటిల్ ఖరారు చేశారు. సినిమాలో హీరో పేరు కూడా అదేనట. 'పెద్ది' టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది ఇవ్వలేదు.‌ 

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసే ఫస్ట్‌ లుక్‌లో 'పెద్ది' టైటిల్ ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి. ఆ లుక్ చరణ్ బర్త్ డే అయినటువంటి గురువారం (మార్చి 27న) ఉదయం 09.09 గంటల సమయానికి విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

Also Read: ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!

ప్రత్యేక ఆకర్షణగా రెహమాన్ ఆర్ఆర్రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర ప్రారంభోత్సవానికి ఆయన విచ్చేశారు.‌ ఆ ఓపెనింగ్ వీడియో గమనిస్తే... ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా కొత్తగా ఉంటుంది. ఆ ఆర్ఆర్ అభిమానులకు పూనకాల తెప్పించింది.‌ 'పెద్ది' గ్లింప్స్‌ కోసం ఆయన స్పెషల్ ఆర్ఆర్ చేశారట. అయితే... ఆ వర్క్ లేట్ కావడంతో ఇప్పుడీ బర్త్ డేకి గ్లింప్స్‌ రిలీజ్ కావడం లేదు. మరో స్పెషల్ అకేషన్‌లో విడుదల చేయవచ్చు. 'పెద్ది' గ్లింప్స్‌ ఎప్పుడు వచ్చినా... రెహమాన్ ఆర్ఆర్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతుందని యూనిట్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

రామ్ చరణ్ జోడీగా జాన్వీ కపూర్'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ సరసన అతిలోక సుందరి జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కథానాయిక విషయాన్ని కూడా చిత్ర ప్రారంభోత్సవంలో అనౌన్స్ చేశారు. ఆవిడ కూడా పూజా కార్యక్రమాలకు హాజరు కావడంతో పాటు ఆల్రెడీ చిత్రీకరణలో పాల్గొన్నారు. జాన్వీ మీద గతవారం హైదరాబాద్ సిటీలో ఈ సినిమా కోసం వేసిన స్పెషల్స్ సెట్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.‌ ఆ సమయంలో జాన్వికి 'అత్తమాస్ కిచెన్' ఫుడ్ కిట్ ఇచ్చారు చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల.

Also Read: చిరంజీవి - అనిల్ సినిమా ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు... పండక్కి స్పెషల్ ప్లాన్?

రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న 'పెద్ది' చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. రామ్ చరణ్ పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు థియేటర్లలోకి సినిమాను తీసుకు రానున్నారు.