Neha Kakkar Controversy: స్టేజి మీద ఏడ్చేసింది... మూడు గంటలు లేట్‌గా వచ్చిందని సింగర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్

Neha Kakkar Controversy : ప్రముఖ బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ కు ఆస్ట్రేలియా కాన్సర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె 3 గంటలు ఆలస్యంగా రావడంతో అభిమానులు ఫైర్ అయ్యారు. నేహా స్టేజ్ పైనే ఎమోషనల్ అయ్యింది.

Continues below advertisement

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన కాన్సర్ట్ కి 3 గంటలు ఆలస్యంగా వచ్చిన ప్రముఖ గాయని నేహా కక్కర్ (Neha Kakkar) వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ, అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పడం కన్పిస్తోంది. కానీ మరోవైపు అభిమానులు మాత్రం ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
వివాదం దేని గురించి? 
మెల్‌బోర్న్ లో నేహా కక్కర్ కాన్సర్ట్ జరిగింది. అంతకు ముందు రోజే సిడ్నీలో జరిగిన కాన్సర్ట్ లో ఆమె అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ మెల్‌బోర్న్ ఈవెంట్ కు మాత్రం లేటుగా వచ్చింది. ఆమె గురించి ప్రేక్షకులు ఎదురు చూసీ చూసీ విసిగి వేసారిపోయారు. దీంతో నేహా ఆలస్యంగా స్టేజ్ పైకి రాగానే 'గో బ్యాక్' అంటూ విరుచుకుపడ్డారు.

Continues below advertisement

లేటుగా వచ్చిన నేహా కక్కర్ మీద దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. "ఇది ఇండియా కాదు. మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు. తిరిగి వెళ్లి రెస్ట్ తీసుకోండి. మేం మీ కోసం రెండు గంటలకు పైగా వెయిట్ చేసాము. కానీ లేట్ గా వచ్చి స్టేజిపై మీరు చేసిన యాక్టింగ్ బాగుంది. ఇదేమి ఇండియన్ ఐడల్ కాదు" అంటూ ఒక వైరల్ వీడియో పోస్ట్ చేసిన ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇటువంటి ట్రోలింగ్ వీడియోలు చాలా ఉన్నాయి. ఇక ఈ కాన్సర్ట్ కు హాజరైన మరో వ్యక్తి వేదికపై నేహ కక్కర్ ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ "7:30 కాన్సర్ట్ ఉంటే, రాత్రి 10 గంటలకు వేదిక పైకి వచ్చింది. ఆ తర్వాత ఏడుపు నాటకం మొదలు పెట్టింది. గంటలోనే కాన్సర్ట్ ముగించింది. ఇంత చెత్త కాన్సర్ట్ ఎక్కడా చూడలేదు... ఇది కంప్లీట్ గా అన్ ప్రొఫెషనల్" అంటూ కామెంట్ చేశారు. మరి కొంతమంది తాము ఈవెంట్ కి ఖర్చుపెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరొకరు ఈ కాన్సర్ట్ కి డబ్బు, సమయం రెండూ వుథా అయ్యాయి అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇలా సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు నేహా కక్కర్ పై వస్తున్న ట్రోల్స్ తో నిండిపోయింది. 

స్టేజ్ మీదే ఎమోషనల్ అయిన నేహా కక్కర్  
అభిమానులను శాంతింప చేయడానికి నేహా కక్కర్ ప్రయత్నించింది. అందులో భాగంగా ప్రేక్షకులకు క్షమాపణ చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. మీరు "నిజంగా నా కోసం చాలా టైం వెయిట్ చేశారు. కానీ నాకు అది ఇష్టం లేదు. నా లైఫ్ లో నేను ఎవ్వరినీ ఇలా వెయిట్ చేయమని ఎప్పుడూ చెప్పలేదు. నన్ను క్షమించండి. అసలేం జరుగుతుందో అని నేను టెన్షన్ పడ్డాను. కానీ మీరు చాలా స్వీట్ గా ఉన్నారు. ఈ ఈవినింగ్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీ విలువైన సమయాన్ని నా కోసం స్పెండ్ చేశారు. కాబట్టి మీ అందరూ డాన్స్ చేసేలా చేస్తాను" అంటూ నేహా కక్కర్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. కానీ అభిమానులు మాత్రం ఆమెపై కోపంతో, అసంతృప్తితో ఉన్నారు. 

Also Read:ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!

నేహా కక్కర్ సోదరుడు, గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ టోనీ కక్కర్ ఆమెను సమర్థిస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈవెంట్ మేనేజ్మెంట్ టీం ఫెయిల్యూర్ ఈ ఆలస్యానికి కారణం అనే విధంగా ఆయన పోస్ట్ చేశారు. టికెట్ బుకింగ్ కాలేదని, తీరా వచ్చాక విమానాశ్రయంలో కారు, హోటల్ రిజర్వేషన్ టికెట్లు లేవని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఈ తప్పుకు ఎవరిని నిందించాలి? అని టోనీ ప్రశ్నించారు. దీంతో నేహా ఇంత ఆలస్యంగా రావడానికి కారణం ఈవెంట్ మేనేజ్మెంట్ అంటూ ఆమె అభిమానులు కొంతమంది ఫైర్ అవుతున్నారు.

Continues below advertisement
Sponsored Links by Taboola