Ram Charan Buchi Babu Movie Peddi First Look Unveiled: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (RamCharan), 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు (Buchibabu) కాంబోలో లేటెస్ట్ మూవీకి 'పెద్ది' (Peddi) అనే టైటిల్ ఖరారు చేశారు. చరణ్ బర్త్ డే సందర్భంగా.. మూవీ టీం గురువారం ఫస్ట్ లుక్ రివీల్ చేసింది. గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో క్రికెట్ ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

మాస్ లుక్ అదిరిపోయిందిగా..

మూవీలో రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. మూవీలో ఆయన రోల్ డిఫరెంట్‌గా ఉండనున్నట్లు లుక్‌ను బట్టి అర్థమవుతోంది. బీడీ కాలుస్తూ.. ముక్కుకు రింగుతో గెడ్డంతో ఆయన లుక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. 'ఓ మనిషి.. ప్రకృతికి ఓ శక్తి' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ మ్యాచ్ జరుగుతున్నట్లుగా ఉండగా.. ఓ ఫైట్ సీన్‌లో లుక్ అని అర్థమవుతోంది. సినిమాలో ఆయన పేరు కూడా 'పెద్ది' అనే టాక్ నడుస్తోంది. ఆయన లుక్ రివీల్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా మూవీ టీం.. రామ్ చరణ్‌కు బర్త్ డే విషెష్ తెలిపింది. 

ఈ మూవీలో చరణ్ సరసన హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఆమె లుక్ రివీల్ చేయగా ఆకట్టుకుంటోంది. మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ ‘చిరుత’, ‘ఎవడు’ to ‘బ్రూస్‌లీ’, ‘రంగస్థలం’ వరకు - ఈ గురువారం (మార్చి 27) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

గ్లింప్స్ ఎప్పుడు?

ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మూవీకి సంబంధించి 2 పాటలు కూడా పూర్తి చేసినట్లు ఇటీవలే రెహమాన్ తెలిపారు. మూవీ ఓపెనింగ్ వీడియో ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించింది. ఫస్ట్ లుక్ అదిరిపోగా.. ఇప్పుడు గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

'గ్లింప్స్ 1000 సార్లు చూస్తారు'

'పెద్ది' మూవీ గ్లింప్స్ ఇటీవలే చూశానని.. ఎంతగానో ఆకట్టుకుందని నిర్మాత రవిశంకర్ అన్నారు. స్పెషల్‌గా రూపొందించిన ఓ సీన్ కోసమైనా గ్లింప్స్‌ను ఆడియన్స్ కనీసం 1000 సార్లు చూస్తారని అభిప్రాయపడ్డారు. 'త్వరలోనే గ్లింప్స్ రిలీజ్ చేస్తాం. మేం నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రాలు 2026లో విడుదల కానున్నాయి. రామ్ చరణ్ - బుచ్చిబాబు మూవీ వేరే లెవల్.' అని పేర్కొన్నారు.

ఐకానిక్ ప్రదేశాల్లో..

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో 'పెద్ది' మూవీ రూపొందుతుండగా.. మైసూర్, హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ బూత్ బంగ్లాలో టీం షూటింగ్ చేసింది. తదుపరి షెడ్యూల్ దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్, జామా మసీదు వంటి ఐకానిక్ ప్రదేశాల్లో చరణ్‌పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో చరణ్ రోల్‌ ఎలా ఉంటుందో అని అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సినీ ప్రియులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.