MADXX Movie Pre Release Event: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. మరో నటుడిని చూసి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అని పొరబడ్డారు. ఈ సందర్భంగా నటుడు ఆంటోనిని భీమ్స్ అని పిలిచారు. తరువాత అసలు విషయాన్ని నిర్మాత నాగవంశీ చెప్పడంతో తన పొరపాటుని అదే స్టేజ్‌పై ఆయన చక్కదిద్దుకున్నారు. 

పొరపాటున ఆంటోనిని చూసి భీమ్స్ అనుకున్న వెంకీ అట్లూరి 

రెండేళ్ల క్రితం చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, సంచలనం సృష్టించిన మూవీ 'మ్యాడ్'. ఇందులో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా నటించారు. ఇప్పుడు ఇదే మూవీకి సీక్వెల్‌గా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో 'మ్యాడ్ స్క్వేర్' మూవీ తెరపైకి రాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో.. నాగవంశీ సమర్పిస్తున్న ఈ మూవీ మార్చి 28న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో 'మ్యాడ్ మ్యాక్స్' పేరుతో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హీరో అక్కినేని నాగచైతన్య ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరు కాగా, డైరెక్టర్ వెంకీ అట్లూరి చీఫ్ గెస్ట్‌గా విచ్చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. స్టేజిపై ఆంటోనీని చూసి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అనుకుని పొరబడ్డారు. 

ఈవెంట్‌లో డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. "భీమ్స్ గారూ ఇటీవల కాలంలో బ్లాక్ బస్టర్ అయిన ప్రతి సినిమాలోనూ మీ చేయి ఉంది. ఆ సినిమాల్లో మీ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసింది" అంటూ ఇంకేదో చెప్పబోయారు. వెంటనే వెనుక నుంచి ప్రొడ్యూసర్ నాగవంశీ అతను భీమ్స్ సిసిరోలియో కాదని చెప్పడంతో "ఏంటి భీమ్స్ కాదా... తనే అనుకున్నానే.. కాదా? సారీ... పరువు పోయింది... సరే ఇక భీమ్స్ మీ సంగీతం చాలా సినిమాల సక్సెస్‌కి దోహదపడింది" అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఈవెంట్లో పొరపాటున ఆంటోనిని భీమ్స్ అని వెంకీ సంభోదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక స్టేజ్‌పైనే ఉన్న నటుడు రవి ఆంటోని గుబురు గడ్డం, జుట్టు పెంచి అచ్చం భీమ్స్ పిసిరోలియో లాగా కనిపించడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

ఒత్తిడిలో ఉన్నప్పుడు బయట పడేసింది 'మ్యాడ్'

ఇక ఇదే ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన నాగ చైతన్య మాట్లాడుతూ.. "ఈ ఈవెంట్‌కు వచ్చినందుకు నేనే థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే స్ట్రెస్‌లో ఉన్నప్పుడు 'మ్యాడ్' మూవీని చూస్తూ, నచ్చిన ఆహారం తింటూ, టెన్షన్ నుంచి బయట పడేవాడిని. ఇలాంటి సినిమాలు హెల్త్‌కి చాలా మంచిది. అంతేకాదు ఈ సినిమాను చూస్తే ఫ్రెండ్షిప్ మరింత బలపడుతుంది. అయితే ఈ సినిమాలో నటించిన వారి పేర్లు 'మ్యాడ్' రిలీజ్‌కి ముందు చాలామందికి తెలియదని చెబుతున్నారు. కానీ నా దృష్టిలో వీళ్ళు ముగ్గురూ స్టార్స్... 'మ్యాడ్ స్క్వేర్' తర్వాత ఈ ముగ్గురినీ అందరూ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. ఇక కళ్యాణ్ శంకర్ నాకు స్క్రిప్ట్ వినిపించినప్పుడే కడుపుబ్బా నవ్వాను" అంటూ 'మ్యాడ్ స్క్వేర్' మూవీ సూపర్ హిట్ కావాలి అని కోరుకున్నారు నాగచైతన్య.