Samantha Meditation : ధ్యానంలో సమంత - సద్గురు ఆశ్రమంలో క్లేష నాశన క్రియలో...

అగ్ర కథానాయిక సమంత ధ్యానం చేస్తున్నారు. సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో ఉన్నారామె.

Continues below advertisement

అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? కోయంబత్తూరులో! ఆధ్యాత్మిక గురువు సద్గురు (Sadhguru)కు చెందిన ఆశ్రమం ఈషా ఫౌండేషన్ (Isha Foundation)లో ఉన్నారు. ధ్యానం చేస్తున్నారు. 

Continues below advertisement

క్లేష నాశన క్రియలో...
లింగ భైరవి ఆలయంలో!Samantha At Isha Yoga Center : గత వారమే సమంత ఈషా యోగ సెంటర్ చేరుకున్నారు. సద్గురు ఆశీస్సులతో... సినిమాలు, చిత్రీకరణకు దూరంగా... మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేస్తున్నారు. మెడిటేషన్ చాలా శక్తివంతమైనదని ఆమె పేర్కొన్నారు. 

ఈషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ధ్యాన కార్యక్రమాల్లో సమంత పాల్గొంటున్నారు. ఆమె క్లేష నాశన క్రియ (ధ్యానం)లో పాలు పంచుకుంటున్నారని తెలిసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా!

మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కోసం క్లేష నాశన క్రియను చేపడతారు. ఏడాదిలో రెండుసార్లు ఈషా ఆశ్రమంలో ఈ క్రియ జరుగుతుంది. ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో ఒకసారి చేస్తారు. తమకు నరదిష్ఠి తగులుతుందని, తమపై చెడు ప్రభావం పడుతుందని భావించేవారు దీనిని చేస్తారు. మానసిక ప్రశాంతత, ఇంకా ఆరోగ్యం కోసం సమంత క్లేష నాశన క్రియలో పాల్గొంటున్నారని భావించవచ్చు. 

Also Read ఫ్యాన్ మేడ్ పోస్టర్లు బెటర్, 'ఐరన్ మ్యాన్'ను కాపీ కొడతారా? - ప్రభాస్ లుక్కుపై మీమ్స్ 

సినిమాలకు వస్తే... ఇటీవల 'ఖుషి' సినిమా చిత్రీకరణను సమంత పూర్తి చేశారు. కొన్ని రోజుల ముందు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం రూపొందుతున్న వెబ్ సిరీస్ 'సిటాడెల్' షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఈ రెండు పూర్తి చేశాక... సమంత కొత్త సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులు ఏవీ అంగీకరించలేదు. కొన్ని రోజులు ఆమె బ్రేక్ తీసుకుంటారని సమాచారం. 

Also Read త్రివిక్రమ్ కథతో రానా 'హిరణ్యకశ్యప' - హాలీవుడ్ గడ్డపై ప్రకటన


'ఖుషి'లో సమంత పాత్ర ఏమిటి?
'ఖుషి' సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా సమంత నటిస్తున్నారు. ఈ సంగతి అందరికీ తెలుసు. అయితే... ఆమె పాత్ర ఏమిటి? అనేది ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. సమంత పుట్టినరోజు కానుకగా 'ఖుషి' నుంచి చిత్ర బృందం ఓ స్టిల్ విడుదల చేసింది. అందులో ఆమెను చూస్తే... ఐటీ ఉద్యోగి పాత్ర చేస్తున్నారని ఈజీగా చెప్పవచ్చు. 

'నా రోజా నువ్వే...' పాట చూశారా? అందులో కశ్మీరీ ముస్లిం యువతిగా సమంత కనిపించారు. కొన్ని దృశ్యాల్లో బుర్ఖా ధరించారు. ఈ మధ్య విడుదలైన 'ఆరాద్య...' పాట చూశారా? అందులో విజయ్ దేవరకొండ భార్యగా మెడలో తాళిబొట్టు, నుదుట కుంకుమ బొట్టుతో కనిపించారు. హిందూ యువకుడిని ముస్లిం యువతి ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత హిందూ సంప్రదాయంలోకి మారారని కొందరు నెటిజనులు తమకు తోచిన విశ్లేషణలు చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం... 'ఖుషి'లో సమంత రెండు మూడు గెటప్పులో కనిపిస్తారు. దాని వెనుక అసలు కథ ఏమై ఉంటుంది? అనేది ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.  

'మహానటి' సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా కనిపించారు. అయితే, అందులో వాళ్ళ పాత్రలు కథను ముందుకు చెప్పేందుకు ఉపయోగపడ్డాయి. ఈ 'ఖుషి' వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న ప్రోపర్ సినిమా. 'మజిలీ' తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత నటిస్తున్న చిత్రమిది. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement