Actress Hema: టాలీవుడ్ లో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. అందులో కొంతమంది పేర్లు చెప్పమంటే టక్కున గుర్తొచ్చే పేర్లలో నటి హేమ ఒకరు. బాలకృష్ణ ‘భలేదొంగ’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఇండస్ట్రీలోకి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘క్షణం క్షణం’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ... ‘క్షణ క్షణం’ సినిమాలో తన ఎంపిక గురించి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 


అప్పుడే లైఫ్ లో ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కాను: హేమ


‘క్షణ క్షణం’ 1991లో విడుదలై మంచి హిట్ అందుకుంది. అందులో విక్టరీ వెంకటేష్, నటి శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో హేమ నటించింది. అయితే ఆ మూవీలో తనకు అవకాశం ఎలా వచ్చిందో ఈ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది హేమ. ఆ సినిమా ఆడిషన్స్ చెన్నైలో జరిగాయని చెప్పింది. అప్పుడు తనకు సుమారు 14 ఏళ్ల వయసు ఉంటుందని, ఆడిషన్స్ కు దాదాపు 100 మంది వచ్చారని, కానీ అందులో తాను ఒక్కదాన్నే సెలక్ట్ అయినట్టు చెప్పింది. ఆ మూవీ ఆడిషన్స్ కోసమే ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కి చెన్నై వెళ్లానని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది హేమ.


రామ్ గోపాల్ వర్మ అలాంటోడని అనుకున్నా: హేమ


‘క్షణ క్షణం’ ఆడిషన్స్ సెలక్ట్ అయిన తర్వాత ఆ సినిమా మొదటి రోజు షూటింగ్ విశేషాలను చెప్పుకొచ్చింది. తాను మొదటి రోజు షూటింగ్ కి వెళ్లినపుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను చూసి కాస్త భయం వేసిందని చెప్పింది. ఎందుకంటే ఆయన కళ్లు పెద్దగా ఉంటాయని అందులోనూ షూటింగ్ రోజు తాను ఓ పక్కన కూర్చుంటే తన వైపు సీరియస్ లుక్ లో చూస్తున్నాడని చెప్పింది. తన పక్కనే శ్రీదేవి కూడా ఉందని, అయితే వర్మ చాలా సేపు అలా చూస్తూ ఉంటే తనకు భయం వేసిందని చెప్పింది. ‘‘అతనేంటి ఇలా చూస్తున్నాడు. నాకు భయం వేస్తుంది. నేను మా ఇంటికి వెళ్లిపోతా’’ అని ఏడ్చానని అంది. అయితే తర్వాత శివ నాగేశ్వరరావు వాళ్లు వచ్చి ‘‘ఆయన నీ వైపు చూడటం లేదు. అలా చూస్తూ సీన్ ఆలోచించుకుంటున్నాడు’’ అని చెప్పడంతో భయం తగ్గిందని తెలిపింది. అలా ఆ సినిమా షూటింగ్ సమయంలో విశేషాలను గుర్తు చేసుకుంది హేమ. హేమ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 


నటి హేమ 1989 లో నే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ‘చిన్నారి స్నేహం’ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన ఈమె అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. టాలీవుడ్ లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొద్ది మంది ఆర్టిస్టుల్లో హేమ కూడా ఒకరు. 1989లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం హిందీ సినిమాల్లో నటించింది హేమ. దాదాపు 500 సినిమాలకు పైగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది హేమ. ప్రస్తుతం సినిమాల్లో తక్కువగా కనిపిస్తోంది హేమ. 


Also Read: ఇలాంటి సినిమా చూసి చాలా రోజులైంది - ‘బేబీ’పై దర్శకుడు సుకుమార్ ప్రశంసలు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial