Sukumar: దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంతలో తెరెక్కిన మూవీ ‘బేబీ’. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. చిన్న సినిమాగా విడుదలై సన్సేషనల్ హిట్ అందుకుంది ‘బేబీ’ మూవీ. ప్రస్తుత యువత లవ్ స్టోరీలను ఆధారంగా తీసుకొని ఎన్నో విభిన్నమైన కోణాల్లో చూపించి మెప్పించారు దర్శకుడు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీపై విమర్శకుల ప్రశంసలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా సాయి రాజేష్ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. ఇటీవలే రవితేజ ఈ సినిమా గురించి చెబుతూ పోస్ట్ చేశారు. తాజాగా స్టార్ దర్శకుడు సుకుమార్ కూడా ఈ మూవీపై ప్రశంసలు కురింపించారు. ప్రస్తుతం సుకుమార్ చేసిన వ్యాఖ్యలు మూవీటీమ్ మరింత ఉత్సాహాన్ని నింపాయనే చెప్పాలి.
సినిమాలో ప్రతీ సీన్ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది: సుకుమార్
‘బేబీ’ సినిమాపై దర్శకుడు సుకుమార్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక నోట్ రాసుకొచ్చారు. చాలా కాలం తర్వాత తాను ఒక అద్భుతమైన రచనను చూశానని అన్నారు సుకుమార్. ఇది కచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త వేవ్ ను క్రియేట్ చేసిందని అన్నారు. తనకు ప్రతీ సీన్ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపించిందని వ్యాఖ్యానించారు. సినిమాలోని పాత్రలు కూడా చాలా బాగా చేశారని, హీరోయిన్ వైష్ణవి చైతన్య వందశాతం ఇచ్చిందని అన్నారు. అలాగే ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లు కూడా చాలా బాగా చేశారని కితాబిచ్చారు. అలాగే విజయ్ బుల్గానిన్ సంగీతం చాలా బాగా వచ్చిందన్నారు. ఇక నిర్మాతలు ఎస్ కె ఎన్, మారుతీల అటెంప్ట్ ను కూడా మెచ్చుకున్నారు సుకుమార్. సుకుమార్ లాంటి స్టార్ దర్శకుడు తమ మూవీపై ప్రశంసలు కురిపించడంతో ‘బేబీ’ టీమ్ ఫుల్ ఖుషీ అవుతుందట. సుకుమార్ లాంటి టాప్ దర్శకుడు ‘బేబీ’ సినిమాపై ప్రశంసలు కురింపించడం నిజంగా మూవీ టీమ్ కు మంచి బూస్ట్ ఇచ్చే వార్తేనని కామెంట్ చేస్తున్నారు ఇది చూసిన నెటిజన్స్.
కలెక్షన్స్ లో దూసుకుపోతున్న ‘బేబీ’..
‘బేబీ’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మంచి టాక్ తో దూసుకుపోతోంది. విడుదల అయిన మొదటి రోజు నుంచీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. మూవీకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు. దీంతో మొదటి రెండు రోజుల్లోనే రూ.14 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. తర్వాత నుంచీ కూడా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డ్ లు కనబడుతున్నాయి. దీంతో మొత్తంగా మూవీ రిలీజ్ అయిన 5 రోజుల్లోనే రూ.40 కోట్లకు చేరువలో వసూళ్లు రాబట్టింది. ఇది ఇలాగే కొనసాగితే ఈ వారాంతానికి మూవీ రూ.50 కోట్లు వసూళ్లు సాధించే అవకాశం ఉందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి లాంగ్ రన్ లో మూవీ ఎంత మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.
Also Read: దర్శకుడు శంకర్ హైటెక్ ప్రయోగం - చనిపోయిన ఆ ఇద్దరు కూడా ‘భారతీయుడు-2’లో నటిస్తారట!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial