సౌత్ క్వీన్ సమంత తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక కవిత వైరల్ అవుతుంది. తనకు మార్గదర్శకంగా నిలిచింది అంటూ సామ్ స్ఫూర్తిదాయకమైన పోస్ట్ ను షేర్ చేయడంపై పలువురు సెలబ్రిటీలతో సహా, అభిమానులు కూడా స్పందిస్తున్నారు. అయితే సమంత ఈ పోస్ట్ ను నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ళ పెళ్లికి ముందు షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది.
"మిమ్మల్ని అందరూ నిందిస్తున్నప్పుడు తలెత్తుకొని నిలబడితే... పురుషులంతా అనుమానించినప్పుడు మిమ్మల్ని మీరే నమ్మితే... రిస్క్ చేసి ఓడిపోతే... కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టు... ఓటమి గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు. హృదయాన్ని మరింత కఠినం చేసుకుని, సుదీర్ఘ ప్రయాణానికై ధైర్యంగా ముందుకు కదులు... నీ దగ్గర ఏమీ లేనప్పుడే సంకల్ప బలం నిన్ను నడిపిస్తుంది... అప్పుడే నిన్ను నిందించే వారికి సైతం సమాధానం చెప్పొచ్చు" అంటూ సాగింది సమంత షేర్ చేసిన ఆ పోస్ట్. ఈ కవితను పోస్ట్ చేస్తూ సమంత అది తనకు ఒక మార్గదర్శక కాంతి లాగా పని చేస్తుందని, అందుకే అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను అని రాసుకొచ్చింది. సామ్ పోస్ట్ లో మొత్తం రెండు పేజీల కవిత ఉండగా, దీనిపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్ "ఇదే పోయెమ్ ప్రింట్ నా వాల్స్ పై ఉంది. నాకు మోటివేషన్ అవసరం అయినప్పుడు బాగా హెల్ప్ అయ్యింది" అని కామెంట్ చేశాడు.
ఈ కవితను 1895లో రడ్యార్డ్ అనే రైటర్ రాశారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ పోయమ్ ఫ్రేమ్డ్ కాపీలు భారతదేశంలో, పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), ఎజిమలలోని నావల్ అకాడమీలో చోటు దక్కించుకున్నాయి. వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌లోని ఆటగాళ్ల ప్రవేశ ద్వారం వద్ద ఈ పోయమ్ లోని సక్సెస్ - ఫెయిల్యూర్ గురించి ఉన్న ఐకానిక్ లైన్లు రాసి పెట్టారు. గతంలో న్యూయార్క్‌లోని వెస్ట్ సైడ్ టెన్నిస్ క్లబ్లో కూడా ఇవే లైన్స్ కన్పించేవి.
ఇదిలా ఉండగా సమంత 2017లో నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. 2021లో ఈ జంట విడిపోయారు. ఆ తర్వాత సమంత తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చింది. రీసెంట్ గా ఈ అమ్మడు "సిటాడెల్ : హనీ బన్నీ" అనే సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. దర్శకద్వయం రాజ్ అండ్ డికె దీనికి దర్శకత్వం వహించగా, వరుణ్ ధావన్ హీరోగా నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో "సిటాడెల్: హనీ బన్నీ" స్ట్రీమింగ్ అవుతోంది. సామ్ ఇప్పుడు "రక్త బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్డమ్" అనే మరో వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. మరోవైపు ఆగస్టులో నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరగ్గా, డిసెంబర్లో పెళ్లి చేసుకోబోతున్నారు.
Also Read: జీబ్రా రివ్యూ: సత్యదేవ్ వర్సెస్ డాలీ ధనుంజయ... హీరోలు ఇద్దరిలో ఎవరిది పైచేయి? మూవీ హిట్టేనా?