త కొన్ని రోజుల క్రితం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడిన సినీ నటి సమంత జీవితంలో ఎన్నో సవాళ్లను ఫేజ్ చేస్తూ.. విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. నిజ జీవితంలో, వైవాహిక జీవితంలో ఎన్ని ఒత్తిళ్లుళ్లు ఎదురైనా వాటిని బ్యాలెన్స్ చేస్తూ.. ఈ రోజు అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలుస్తున్నారు. అయితే ఎంత సాధించినా, ఎన్ని సినిమాలు హిట్ అయినా.. చాలా మంది సంధించే ప్రశ్న... భర్త, హీరో అక్కినేని నాగ చైతన్యతో ఎందుకు విడాకులు తీసుకున్నారు. అసలేమైంది అని. ఈ విషయంపై సోషల్ మీడియాలో అప్పట్లో జోరుగానే ప్రచారం జరిగింది. నాణేనికి రెండు భాగాలున్నట్టు అందులో కొన్ని నిజాలు కాగా.. మరికొన్ని రూమర్స్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రూమర్స్ పై సమంత క్లారిటీ ఇచ్చారు. తాను చేసిన ఐటెం సాంగ్ వల్లే.. తమ మధ్య విబేధాలు వచ్చాయని స్పష్టం చేశారు. 


 అక్కినేని నాగచైతన్య  హీరోగా చేసిన 'ఏం మాయ చేశావే'తో సమంత తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమ్యారు. ఈ మూవీ ఎవరూ ఊహించని రీతిలో హిట్ అవ్వడం విశేషం. కానీ మొదటి సినిమానే ఆమెకు లైఫ్ ఇస్తుందని, జీవిత భాగస్వామిని తెచ్చిపెడుతుందని ప్రేక్షకులే కాదు సమంతే కూడా ఊహించలేదు. అలా నాగ చైతన్యతో పరిచయం కాస్త ప్రేమగా మారి, 2017లో పెద్దల సమక్షంలో వారిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. అంతా బాగుందనుకుంటున్న సమయంలోనే పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత అక్టోబర్ 2, 2021న చై, సామ్ విడిపోతున్నట్టు ప్రకటించారు. ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరు విడిపోవడం పట్ల చాలా మంది సినీ అభిమానులు బాధపడ్డారు కూడా.


అయితే అప్పట్నుంచీ నాగచైతన్యకు దూరంగా ఉంటున్న సమంతపై పలు విమర్శలు కూడా వచ్చాయి. చాలా మంది ఎన్నో అబాండాలు వేస్తూ ఆమెపై కామెంట్స్ చేశారు. వాటన్నింటికీ ఆన్సర్ గా సమంత స్పందించింది. తాను అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలోని 'ఊ అంటావా మావా ఊఊ అంటావా' సాంగ్ లో నటిస్తున్నప్పుడే తమ విడాకుల ప్రస్తావన వచ్చిందన్నారు. అప్పుడు తనను ఐటెం సాంగ్ లో నటించొద్దని స్నేహితులు, కుటుంబసభ్యులు చెప్పారని తెలిపారు. ఎప్పుడూ ఛాలెంజింగ్ పాత్రలు చేయమని ప్రోత్సహించే దగ్గరి ఫ్రెండ్స్ కూడా 'ఐటెం సాంగ్ చేయొద్దు' అని చెప్పారని సమంత తెలిపారు. తాను మాత్రం అప్పుడు ఒక్కటే అనుకున్నానని, తానేం నేరం చేయట్లేదు, తప్పు చేయట్లేదు.. నేనేందుకు ఆగిపోవాలి అని సమంత అన్నారు. తన వైవాహిక జీవితంలో తన తరపు నుంచి 100 శాతం ఇచ్చానని, కానీ అది పనిచేయలేదని ఆమె భావోద్వేగపూరిత కామెంట్స్ చేశారు. ఆ తర్వాత కూడా తనను ఎంతో ట్రోల్ చేశారని, ఐటెం సాంగ్ చేయొద్దంటే చేశావు. ఇక ఇంట్లో కూర్చో అని తిట్టారని కూడా ఆమె చెప్పారు. కానీ మీ అందరూ చూశారుగా.. ఊ అంటావా సాంగ్ ఎంత హిట్ అయ్యి, ఎంత పేరు తెచ్చిందో అంటూ ఆమె గర్వంగా చెప్పారు. 


ఈ పాట వల్లే తనకు ఇంతకు ముందెప్పుడూ దక్కని పేరు వచ్చిందని, ఆ పాటలో తనకు సాహిత్యం నచ్చడం వల్లే తాను చేశానని సమంత స్పష్టం చేశారు. విభిన్న పాత్రలను అన్వేషించడం తనకు చాలా ఇష్టమన్న ఆమె.. అందులో భాగంగానే ఈ ఐటెం సాంగ్ చేశానని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవలే మయోసైటిస్ అనే వ్యాధి నుంచి కోలుకున్న సమంత, డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఇటీవలే 'శాకుంతలం' సినిమాలో నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 14న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుండడంతో సామ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Read Also: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత