నవ్వి నవ్వి ప్రేక్షకులకు కడుపు నొప్పి రావడం చూడాలని ఉందంటూ సమంత (Samantha) చెబుతున్నారు. 'కన్మణి రాంబో ఖతీజా' (Kanmani Rambo Khatija Movie) చూస్తే కడుపు చెక్కలు అవ్వడం ఖాయమని అంటున్నారామె. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తుందీ సినిమా. ఈ రోజు షూటింగ్ కంప్లీట్ చేశారు.

Continues below advertisement


విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా 'కాతువాకుళే రెండు కాదల్' (Kaathuvaakula Rendu Kaadhal). తెలుగులో 'కన్మణి రాంబో ఖతీజా'గా విడుదల కానుంది. దీనికి విఘ్నేష్ శివన్ దర్శకుడు. లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే... ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ (Samantha wrapped Kaathuvaakula Rendu Kaadhal movie shoot) అయ్యింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన ఫొటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు.


విజయ్ సేతుపతి, నయనతార, సమంత... తన సినిమాకు ఇంతకంటే బెటర్ కాంబినేషన్ ఉండదని, అద్భుతమైన ప్రతిభావంతులైన నటీనటులతో పని చేయడం ఏ దర్శకుడైన కల నిజమైనట్టు ఉంటుందని దర్శకుడు విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు.


Also Read: ఇద్దరు పెళ్ళాలతో తిప్పలు పడే ముద్దుల మొగుడిగా విజయ్ సేతుపతి!


కన్మణి పాత్రలో నయనతార (Nayanthara), ఖతీజా పాత్రలో సమంత (Samantha), రాంబో పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నారు. ఆల్రెడీ టీజర్ విడుదల చేశారు. ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడిన యువకుడిగా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) క్యారెక్టర్ ఆకట్టుకుంది.


Also Read: సన్నీ లియోన్‌తో ఇటువంటి చిత్రమా?