Samantha about Naga Chaitanya: ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న సీనియర్ నటీమణుల్లో సమంత ఒకరు. కొన్నాళ్లుగా ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ ఉమెన్ సెంట్రిక్ కథలతో నటించడానికి ఇష్టపడుతోంది ఈ భామ. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండడం సమంతకు అలవాటు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటుంది సామ్. తాజాగా మరోసారి ఫ్యాన్స్‌ను ప్రశ్నలు అడగండి అంటూ టాస్క్ ఇచ్చింది. ఆ సందర్భంలో తన పర్సనల్ లైఫ్‌లో వచ్చిన మార్పుల గురించి, తను జీవితంలో చేసిన తప్పుల గురించి బయటపెట్టింది.


తన వల్లే ప్రభావితం అయ్యాయి..
తాజాగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో సమంతకు ఒక ప్రశ్న ఎదురయ్యింది. ‘ఒకవేళ పర్సనల్ గ్రోత్ అనేదాన్ని ఒక రీల్‌లాగా మార్చాలి అనుకుంటే.. దానికి దేనిని బ్లూపర్‌లాగా భావించి నవ్వుకుంటారు? మీరు జీవితంలో నేర్చుకున్న గొప్ప విషయం ఏంటి?’ అని సమంతను తన ఫ్యాన్ ప్రశ్నించారు. దానికి సమంత ఓపికగా సమాధానమిచ్చింది. ‘నా ఇష్టాలు, అయిష్టాలు తెలుసుకోకపోవడమే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అయ్యిండొచ్చు. అప్పుడు నాకు ఉన్న పార్ట్‌నర్ వల్లే చాలావరకు నేను ప్రభావితం అయ్యాను’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా నాగచైతన్య ఇష్టాలు, అయిష్టాలు తనపై ప్రభావం చూపించాయని సమంత బయటపెట్టింది.


అదే నా ఎదుగుదలకు కారణం..
‘అతికష్టమైన సమయాల్లో కూడా మనం నేర్చుకోవడానికి అతి ముఖ్యమైన పాఠమైన ఏదో ఒకటి ఉంటుంది అని తెలుసుకున్న మూమెంట్‌లో నాకు పర్సనల్ గ్రోత్ వచ్చిందని నేను నమ్ముతాను’ అంటూ తన పర్సనల్ లైఫ్‌లోని గ్రోత్ గురించి చెప్పుకొచ్చింది సమంత. 2017లో నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్నారు. పెళ్లికంటే ముందు నాలుగేళ్లు వీరు ప్రేమలో ఉన్నారు. మతాలు వేరు అయినా కూడా మనసులు కలవడంతో ఇద్దరి మతాల సాంప్రదాయల్లో వీరి పెళ్లి జరిగింది. కానీ ఆ పెళ్లి ఎక్కువకాలం నిలబడలేదు. 2021 అక్టోబర్‌లో నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టుగా ఒకేసారి సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా వీరి ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు.


చివరిగా ‘ఖుషి’లో..
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న చాలాకాలం వరకు తప్పు అంతా సమంతదే అన్నట్టుగా నెటిజన్లు మాట్లాడారు. అంతే కాకుండా విడాకులు ఎందుకు తీసుకున్నారు అనేదానిపై రూమర్స్ కూడా క్రియేట్ చేశారు. చాలావాటికి సమంత.. సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతూ వచ్చింది. కొన్నాళ్లకు రియాక్ట్ అవ్వడం ఆపేసింది. ఎప్పటిలాగానే తన సినిమాలతో బిజీ అయిపోయింది. విడాకుల తర్వాత కథల విషయంలో మరింత కచ్చితంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది సామ్. చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ అనే మూవీలో నటించింది. ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ లభించింది. ‘మజిలి’ ఫేమ్ శివ నిర్వాణ.. ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం సమంత అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. తన చేతిలో ఒక్క హాలీవుడ్ చిత్రం మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది.


Also Read: దేవుళ్లను ఎప్పుడూ తప్పుగా చూపించలేదు, అవి చూసి ఎలా తీయకూడదో నేర్చుకున్నా - ‘హనుమాన్’ డైరెక్టర్