Sandeep Reddy Vanga: 'కబీర్ సింగ్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. 'యానిమల్' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బోల్డ్ అండ్ వైల్డ్ కంటెంట్ తో సినిమా తీసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. రియల్ లైఫ్ యాటిట్యూడ్ తోనూ వార్తల్లో నిలిచే సందీప్.. ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో ఫేవరిజమ్, జంతువులలాంటి ప్రవర్తన గురించి మాట్లాడారు. అవార్డు షోలలో కేవలం తమ ఫ్రెండ్స్ ను మాత్రమే ప్రమోట్ చేస్తారని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇండస్ట్రీలో తనకు ఎదురైన సమస్యల గురించి ఎంతో మాట్లాడగలనని, కానీ తాను చిన్నపిల్లాడిలా ఏడవాలని అనుకోవడం లేదని అన్నారు. 


సందీప్ వంగ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో ఫేవరిజమ్, బంధుప్రీతి గురించి మాట్లాడుతూ.. బయటి వ్యక్తులను స్వాగతించడం కంటే ఇండస్ట్రీలో తమ సొంతవారిని ప్రమోట్ చేసుకోడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు. ''ఇది అక్షరాలా జంతువుల ప్రవర్తన లాంటిది. మీ పరిశ్రమలోకి ప్రవేశించే వారికి వ్యతిరేకంగా మీరు తిరుగుబాటు చేస్తాం. అవార్డుల షోలను చూడండి. వారు తమ సొంత స్నేహితులను ప్రమోట్ చేసుకుంటారు. అవార్డుల కార్యక్రమం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కబీర్ సింగ్, యానిమల్‌ సినిమాలతో గత నాలుగేళ్లలో నాకు ఎదురైన అనుభవాలను చెప్పాలని అనుకుంటే నేను రేపటి వరకూ చెప్పగలను. అవన్నీ చెప్తే మీ కెమెరా మెమరీ అయిపోతుంది. కానీ నేను చిన్నపిల్లలా ఏడవాలని అనుకోవడం లేదు'' అని సందీప్ అన్నారు. 


Also Read: 'గేమ్ ఛేంజర్' అప్డేట్: దసరాని టార్గెట్ గా పెట్టుకున్న రామ్ చరణ్?


ఇంతకముందు 'యానిమల్' సినిమాకు నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన బాలీవుడ్ క్రిటిక్స్ పై సందీప్ వంగా ఫైర్ అయిన సంగతి తెలిసిందే. “ఐదేళ్లు నేను ముంబైలో ఉండి తెలుసుకున్నది ఏంటంటే.. ఇక్కడ కొన్ని గ్యాంగ్స్ (క్రిటిక్స్) ఉన్నాయి. వాళ్ళు కొందరు ఫిలిం మేకర్స్ దగ్గర డబ్బులు తీసుకొని సినిమాలను పొగుడుతూ మంచి రివ్యూలు ఇస్తూ వస్తున్నారు. వాళ్లంతా నా మూవీలోని అభ్యంతరకర సన్నివేశాలు గురించే మాట్లాడుతున్నారు తప్ప, మిగతా క్రాఫ్ట్ గురించి మాట్లాడరు. సినిమా ఓపెనింగ్స్ గురించి ఎవరూ రాయరు. ఎందుకంటే వాళ్ళకి అవేవి తెలియదు. వాటిపై వాళ్ళకి అవగాహన కూడా లేదు” అంటూ సందీప్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు లేటెస్టుగా బాలీవుడ్ లో ‘యానిమల్’ లాంటి బిహేవియర్ ఉందని విమర్శించడం నెట్టింట వైరల్ గా మారాయి.


కాగా, ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. అదే సినిమాని 'కబీర్ సింగ్' పేరుతో హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ జనాల దృష్టిని ఆకర్షించాడు. ఇక మూడో సినిమా 'యానిమల్' తో బీ టౌన్ లో అతని పేరు మార్మోగిపోయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 915 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రీ హీరోయిన్లుగా నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. 69వ ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌లో ఈ సినిమా 19 కేటగిరిల్లో నామినేషన్స్ సాధించింది. జనవరి 27 - 28 తేదీలలో గుజరాత్‌లోని గాంధీనగర్‌ లో ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. 


ఇక సందీప్ వంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయానికొస్తే, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' అనే పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా, 'యానిమల్ పార్క్' మూవీ దర్శకుడి లైనప్ లో ఉన్నాయి. 


Also Read: బాక్సాఫీస్ వద్ద కిష్టయ్య డామినేషన్, 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ - 'నా సామిరంగ' కలెక్షన్స్ ఎంతంటే?