Prabhas Salaar Second Single Update : ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న 'సలార్' మూవీ మరో 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇప్పటికే అన్నిచోట్ల ‘సలార్’ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మరోవైపు మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. సరిగ్గా రెండు రోజుల క్రిందట ‘సలార్’ రిలీజ్ ట్రైలర్ విడుదల చేయగా ఆ ట్రైలర్ కి అనూహ్య స్పందన వచ్చింది.


ఫస్ట్ ట్రైలర్ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ సెకండ్ ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఒక విధంగా ఈ ట్రైలర్ తో సలార్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు తాజాగా సలార్ మేకర్స్ మరో అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సలార్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ని ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ విడుదల చేశారు. 'ప్రతి కథలో' అనే లిరిక్స్ తో ఈ పాట సాగనున్నట్లు ఇందులో తెలిపారు. పోస్టర్, సాంగ్ టైటిల్ ని బట్టి చూస్తే ఇది కూడా ఎమోషనల్ సాంగ్ లాగే అనిపిస్తోంది.


మరోవైపు ఇప్పటికే సలార్ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'సూరీడే' లిరికల్ వీడియో సాంగ్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. "సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజము తట్టి.. చిమ్మ చీకటిలో నీడల ఉండేటోడు.." అంటూ సాగే ఈ పాట ప్రభాస్, పృధ్విరాజ్ మధ్య స్నేహ బంధాన్ని ఎంతో ఎమోషనల్ గా చూపించేలా ఉండడంతో సినిమాలో యాక్షన్ తో పాటు హృదయాన్ని హత్తుకునే ఎమోషన్స్ కూడా ఉంటాయని ఈ పాటతోనే స్పష్టమైంది. అయితే, ఈ సెకండ్ సింగిల్ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేస్తుంది. పిల్లలు ఆలపించిన ‘‘ప్రతి కథలో రాక్షసుడే హింసలు పెడతాడు’’ అంటూ సాగే ఈ పాట మళ్లీ మళ్లీ వినాలినిపిస్తుంది. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు.


కాగా ఈ సినిమాలో ప్రభాస్ దేవా అనే పాత్రలో పృధ్విరాజ్ వరదరాజమన్నార్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా మారారు? అనే కథాంశంతో సలార్ మూవీ తెరకెక్కింది. సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. జగపతిబాబు, ఈశ్వరి రావు, బాబి సింహ, టీనూ ఆనంద్, సప్తగిరి, పృధ్విరాజ్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేజిఎఫ్ సినిమాని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. భువన గౌడ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు.


Also Read : తెలివి తక్కువ వాడిలా కనిపించే తెలివైన వాడు, ప్రభాస్ గురించి రాజమౌళి షాకింగ్ కామెంట్స్